వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో చాలా మంది టూర్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా వేసవి తాపం నుంచి బయటపడేందుకు బీచ్ లు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటారు. చల్లటి నీటిలో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తారు. వేడి నుంచి కాస్త కుదుటపడుతారు. ప్రకృతి అందాల నడుమ జలపాతాలు జాలువారుతుంటే, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. వేసవిలో ఏ వాటర్ ఫాల్స్ చూసిన టూరిస్టులతో కళకళలాడుతుంది. అలాగే ఓ జలపాతం దగ్గరికి వెళ్లిన కొంత మంది టూరిస్టులు నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా ఏదో నెమ్మదిగా కదులుతున్నట్లు అనిపించింది. దాన్ని గమనించిన టూరిస్టులు, మరింతగా పరిశీలించి చూసి షాక్ అయ్యారు. జీవితంలో ఎప్పుడూ చూడని పరిమాణంలో భారీ అనకొండ కనిపించడంతో భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ అనకొండ సుమారు 20 అడుగుల పొడవు ఉంది.
భయంతో వణికిపోయిన టూరిస్టులు
అనకొండ అనే పేరు వినగానే జనాల వెన్నులో వణుకు పుడుతుంది. కానీ, నిజంగా ఎదురుగా పెద్ద పరిమణాలో అనకొండ కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరిగెత్తారు. ఇంతసేపు ఈ నీళ్లలో స్నానం చేశామనా? అని షాక్ అయ్యారు. అనకొండ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ, ఈ వీడియోలో అనకొండ నెమ్మదిగా నీళ్లలోకి వెళ్లడం కనిపిస్తుంది. అనకొండ ఏదో పెద్ద జంతువును మింగినట్లుగా కనిపించింది. అందుకే, దాని కడుపు పెద్ద పరిమాణంలో ఉంది.
A real-life anaconda spotted in Jardim, Brazil. pic.twitter.com/Tci8775hZZ
— Sarahh (@Sarahhuniverse) March 9, 2025
బ్రెజిల్ లో కనిపించిన భారీ అనకొండ
జలపాతంలో నుంచి బయటకు వెళ్లిన టూరిస్టులు అనకొండను ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ అనకొండ వీడియోను @ Sarahhuniverse హ్యాండిల్ పేరుతో ఎక్స్ లో పోస్టు అయ్యింది. ‘బ్రెజిల్ లోని జార్డిమ్ కనిపించిన రియల్ అనకొండ’ అంటూ క్యాప్షన్ పెట్టారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ వీడియోను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తోంది. వీడియోలో చూస్తేనే అంత భయంగా ఉంటే, నిజంగా చూసిన వాళ్లు ఎంత భయపడి ఉంటారో? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు అనకొండ కడుపు నిండుగా కనిపించడంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. “అనకొండ ఇటీవలే కడుపు నిండా తిన్నది కాబట్టే వాటర్ ఫాల్ లోకి దిగిన వాళ్లు ఆహారం కాలేదు” అని అంటున్నారు. “ఈ వాటర్ ఫాల్ లోకి దిగిన వాళ్లు భవిష్యత్ లో ఇకపై జలపాతంలోకి అడుగు పెట్టాలంటేనే భయంతో వణికిపోవడం ఖాయం” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జాగ్రత్తగా ఉండాలంటున్న నెటిజనులు
సమ్మర్ వెకేషన్ లో భాగంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే, కాస్త అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అనకొండలే కాదు, నీటిలో ఉండే విష సర్పాలు, మొసళ్లు ప్రాణాలు తీసే అవకాశం ఉందంటున్నారు. ముందుగా పరిసరాలను పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని భావించిన తర్వాతే వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేయాలంటున్నారు.
Read Also: ఏసీలో పిల్లలను పెట్టిన పాము, ఎక్కడా ప్లేస్ దొరకలేదానే తల్లీ?