CEC Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అంశంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోందని అన్నారు. బీజేపీ కావాలనే కుట్ర పూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించిందని అన్నారు. గతంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్‌ను సీజెఐ ఇతర సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేసే సాంప్రదాయం ఉండేదని అన్నారు.
ఇప్పుడు ప్రధాన మంత్రి, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇద్దరూ కావాలని సిజేఐను తప్పించి కేంద్ర ఎన్నికల కమీషనర్ ను నియమించారని అన్నారు. ఇప్పుడు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలంటే పార్లమెంట్‌లో అభిశంసన తీర్మాణం పెట్టాలన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జ్ఞానేశ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగంలో ఓటు హక్కును తొలగించే కుట్ర జ్ఞానేశ్ కుమార్ చేస్తున్నారని అన్నారు. ఫామ్ 6 ద్వారా ఓట్లను తొలగించి తిరిగి వారికి అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.
Also read: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!
దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారు. ఎప్పటికీ అధికారంలో ఉండాలని బీజేపీ చూస్తోందని, సెలెక్షన్ ప్రాసెస్‌లో ఎన్నికల కమీషన్‌ను బీజేపీ తమ ఆధీనంలో పెట్టుకుందన్నారు. గుజరాత్ మోడల్ తరహాలో ఎప్పటీకీ దేశంలో అధికారం మాదే అనే భ్రమలో మోదీ, అమిత్ షా ఉన్నారన్నారు. సెక్యులర్ దేశాన్ని బీజేపీ భ్రష్టు పట్టించింది. దేశంలో ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియను వెంటనే ఆపాలన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలపై దర్యాప్తు జరపాలన్నారు.
హర్యానా ఎన్నికల ఫుటేజ్ రాహుల్ గాంధీ అడిగితే ఇవ్వలేదని, 45 రోజుల వరకు సీసీ టీవీ ఫుటేజ్ ఉంచాలన్నారు. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా బల్క్ ఓట్లను నమోదు చేశారు. ఫోటోగ్రఫీలను మార్చారని, వీటన్నింటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని అన్నారు. వెంటనే జ్ఞానేశ్ కుమార్ ను కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ పదవి నుంచి తొలగించాలని అన్నారు.
Also read: వ్యాక్యూమ్, మాప్, బ్లోయర్.. మూడు పనులు చేసే ఈ గ్యాడ్జెట్ ధర రూ.4,099 మాత్రమే!