E-Paper
Advertisement

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో కీలక సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకు కొనసాగుతున్న చంద్రశేఖర్ తివారి స్థానంలో మధుకర్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో తెలంగాణకు సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌ను నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గురువారం ప్రకటించిన సంస్థాగత నియామకాల్లో భాగంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. కొత్త నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ వెల్లడించింది.

వరంగల్ కేంద్రంగా..

మధుకర్‌కు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ సంస్థాగత బాధ్యతలను కూడా అప్పగించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. మరోవైపు తెలంగాణకు సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన దశరథ్ వరంగల్ కేంద్రంగా పనిచేయనున్నారు. దీంతో రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల్లో హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ను కూడా కీలక కేంద్రంగా మార్చినట్లయింది.

మరోవైపు మధుకర్..

Advertisement

చంద్రశేఖర్ తివారి స్థానంలో మధుకర్ రావడం తాజా మార్పుల్లో ప్రధాన అంశంగా నిలిచింది. అయితే పార్టీ ప్రకటించిన అధికారిక నియామక జాబితాలో మధుకర్‌కు ఏపీ, తెలంగాణ రెండింటి బాధ్యతలు కేటాయించినట్లు స్పష్టంగా ఉంది. అదే జాబితాలో దశరథ్‌కు తెలంగాణ సంయుక్త సంస్థాగత ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. దీంతో తెలంగాణలో సంస్థాగత యంత్రాంగాన్ని మరింత విస్తరించేలా కొత్త నిర్మాణాన్ని రూపొందించినట్లు కనిపిస్తోంది. దశరథ్ కర్ణాటకకు చెందిన నేతగా పార్టీ వర్గాల్లో గుర్తింపు పొందారు. ఆయనకు వరంగల్ కేంద్రంగా బాధ్యతలు కేటాయించడం ద్వారా తెలంగాణలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అవకాశం దక్కింది. మరోవైపు మధుకర్ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, హైదరాబాద్ కేంద్రంగా పనిచేయడం రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో స్థానిక సంస్థాగత సమన్వయానికి ప్రాధాన్యం ఇచ్చిన నిర్ణయంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also read: బిగ్ బాస్ హౌస్ లోకి అపూర్వ.. మరో కొత్త లవ్ ట్రాక్ షురూ!

అదనపు నాయకత్వం..

Advertisement

తాజా నియామకాలను తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో చూడాల్సి ఉంటుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ముందు రోజు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్‌ను కొనసాగిస్తూ, అభయ్ పాటిల్, రేఖా శర్మలను సహ ఇన్‌చార్జులుగా నియమించారు. దీంతో రాజకీయ బాధ్యతల స్థాయిలోనూ, సంస్థాగత బాధ్యతల స్థాయిలోనూ తెలంగాణకు అదనపు నాయకత్వాన్ని కేంద్రం కేటాయించినట్లయింది. దేశవ్యాప్తంగా ప్రకటించిన సంస్థాగత నియామకాలతో పోలిస్తే.. తెలంగాణకు కేటాయించిన జాబితా ప్రత్యేకంగా కనిపిస్తోంది.

తెలంగాణపై ప్రత్యేక ఫోకస్..

చాలా రాష్ట్రాలకు ఒక్క రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిని మాత్రమే నియమించగా, తెలంగాణకు ప్రధాన కార్యదర్శితో పాటు సంయుక్త ప్రధాన కార్యదర్శి బాధ్యతలను కూడా కేటాయించారు. గుజరాత్‌లోనూ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీతో పాటు జాయింట్ జనరల్ సెక్రటరీని పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఇద్దరు సంస్థాగత కార్యదర్శులను కేటాయించడం పార్టీ రాష్ట్ర యంత్రాంగాన్ని విస్తరించడంలో భాగమేనా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకే ఇద్దరిని కేటాయించి హైకమాండ్ వ్యూహరచన చేపడుతోందని శ్రేణులు భావిస్తున్నాయి.

Also read: పల్సర్‌కు మళ్లీ పాత జోష్ వస్తుందా? కొత్త 125, 150తో బజాజ్ మాస్టర్ ప్లాన్!

Tags

Related News

మీ ఇంటిపై భారీ విద్యుత్ లైన్లు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

టీపీసీసీ చీఫ్‌ సొంత జిల్లాలో గౌడ్‌ల సాంఘీక బహిష్కరణ.. వీడీసీల ఆగడాలకు చెక్‌ పడేదెలా…? దశాబ్దాలుగా ఆ రెండు నియోజకవర్గాల్లో ఇదే అరాచకం..

బైపోల్ తో ఇక అన్నీ సమకూరుతున్నట్టేగా! ఇందిరమ్మ ఇండ్లకు కొదవలేదు… అభివృద్ధి పనులకు అడ్డులేదు..!

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

Big Stories

Advertisement
×