E-Paper
Advertisement

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!

మహేష్ ‘వారణాసి’ పై కార్తికేయ బిగ్ అప్డేట్..గట్టిగనే ప్లాన్ చేస్తున్నారే!
Advertisement

Varanasi Movie: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా అంటే దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇదివరకు రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలో ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి డైరెక్షన్లో రాబోతున్న వారణాసి (Varanasi) సినిమా పై గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ కాబోతున్నారు.

వారణాసికి ట్రైలర్ ఉంటుంది..

ఇటీవలే మహేష్ బాబు(Mahesh Babu) కూడా ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకున్నారు. 2027 ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 7 వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు ట్రైలర్ ఉండదని, నాని ప్యారడైజ్ సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా ట్రైలర్ లేకుండా విడుదల కాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

కార్తికేయ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ…

Advertisement

ఇలా వారణాసి సినిమా గురించి ఈ విధమైనటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎస్ ఎస్ కార్తికేయ (S.S.Karthikeya) ఈ సినిమా ట్రైలర్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాణంలో తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తికేయకు వారణాసి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఆస్కార్ కోసం సినిమా చేయలేదు..

ఇలా వారణాసి సినిమా గురించి కార్తికేయ మాట్లాడుతూ.. వారణాసి సినిమా ప్రమోషన్లను చాలా గట్టిగా ప్లాన్ చేశామని తెలిపారు. అయితే ఈ సినిమాకు ట్రైలర్ కూడా విడుదల అవుతుందని కార్తికేయ క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమా కోసం ఇంగ్లీష్ వెర్ష‌న్ ఒక‌టి రెడీ చేసే ఆలోచ‌న ఉంద‌ని, అందుకోసం రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని కూడా ఆస్కార్ వరకు తీసుకువెళ్తారా? అనే ప్రశ్న ఎదురవడంతో తాము ఈ సినిమాని ఆస్కార్ అవార్డు కోసం చేయడం లేదని, అది ఆర్గానిక్ గా జరిగితే చాలా సంతోషమని తెలిపారు.ఆస్కార్ విష‌యంలో హాలీవుడ్ సినిమాల స్టైల్ వేరుగా ఉంటుంద‌ని, ఆస్కార్ ప్ర‌మోష‌న్ల కోసం చాలా గ‌ట్టిగా ఖ‌ర్చు పెడ‌తార‌ని, ఆ డబ్బుతో మనం ఇక్కడ ఒక పెద్ద సినిమా చేయొచ్చు అంటూ కార్తికేయ ఈ సందర్భంగా తెలియజేశారు. ఏది ఏమైనా వారణాసి సినిమాకు ట్రైలర్ ఉంటుందని ప్రమోషన్లను కూడా గట్టిగా ప్లాన్ చేశామని చెప్పడంతో మహేష్ బాబు అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Also Read: డబ్బింగ్ షూర్ చేసిన ‘ కాకా ‘ .. సంక్రాంతి విడుదలకు సిద్ధం!

Related News

ట్రైలర్‌కు బాలయ్య.. ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్.. అదిరిపోయే ప్లాన్!

మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?

నాని, నేను మూతులు నాక్కుంటాం.. శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ వైరల్

నాని ‘ది ప్యారడైజ్’ మూవీలో కేసీఆర్ ను అవమానించారు: కవిత

స్నిగ్ధ చేతిపై టాటూగా స్టార్ సింగర్ ఆటోగ్రాఫ్.. ఎవరిదంటే?

‘డోరతీ’ సినిమాలో కీర్తి సురేష్ అసభ్యకర సీన్ .. సోషల్ మీడియాలో నిరసన సెగ!

చిరు – శ్రీకాంత్ ఓదెల సినిమా అటకెక్కినట్టేనా ?

ది ప్యారడైజ్ ఫస్ట్ చాయిస్ కయాదు కాదా? ఆమె రిజెక్ట్ చేస్తేనే ఛాన్స్ వచ్చిందా?

Big Stories

Advertisement
×