Jaggareddy Chit Chat: నిజాలు మాట్లాడే నేతల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఒకరు. ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతీసారీ ఏదొక కొత్త విషయం చెబుతున్నారు. సొంత పార్టీ గురించే కాకుండా ప్రత్యర్థుల పార్టీల గురించి నిజాలు ఓపెన్‌గా మాట్లాడారు. అందుకే జగ్గారెడ్డి ఆయన పిలవగానే మీడియా మిత్రులు వస్తుంటారు.
లేటెస్ట్‌గా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మనసులోని మాట బయట పెట్టారు సీనియర్ నేత జగ్గారెడ్డి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కి అహం వచ్చిందని, అందుకే ఎన్నికల్లో ఆ పార్టీ బోల్తా పడిందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్సనాలిటీని డామినేట్ చేసే సత్తా కేజ్రీవాల్‌కు లేదన్నారు.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమాత్రం లేదన్నారు జగ్గారెడ్డి. ఒంటరిగా వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని తెలిపారు. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పార్టీ పోటీ చేసిందన్నారు. కొట్లాడడానికి సిద్ధం కావాలని ఢిల్లీ ఎన్నికల ద్వారా అగ్రనేత కేడర్‌కు సంకేతాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని వెల్లడించారు జగ్గారెడ్డి. ఇవాళ రోజున ఢిల్లీలో బీజేపీ గెలిచింది.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలం మళ్లీ పుంజుకుంటుందని, తాము అధికారంలోకి వస్తామన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో పై విషయాలను బయటపెట్టారాయన.
ALSO READ: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. మరో వారం వాయిదా