Vasalamarri : వాసాలమర్రి.. బంగారు మర్రి హామీ ఏమైంది ? పిట్టలదొర మాటలు నమ్మి మోసపోయారా ?

Vasalamarri : వాసాలమర్రి.. బంగారు మర్రి హామీ ఏమైంది ? పిట్టలదొర మాటలు నమ్మి మోసపోయారా ?

vasalamarri
Share this post with your friends

Vasalamarri : బంగారు వాసాలమర్రి అంటే జనం నమ్మారు. స్వయంగా ముఖ్యమంత్రే నడిచొచ్చారని సంబరపడ్డారు. రూ.10 లక్షలు ఇస్తామంటే పండగొచ్చిందనుకున్నారు. కొత్త ఇళ్లతో ఊరంతా నిర్మిస్తామంటే ఎప్పుడు తెల్లారుతుంతా అని రాత్రిళ్లు ఎదురు చూశారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెవాసులూ.. అబ్బా మాది వాసాలమర్రి కాకపోయే అని బాధపడ్డారు. అబ్బా పుడితే అక్కడే పుట్టాలిరా అని కలలు గన్నారు. ఇదంతా మూడేళ్ల క్రితం మాట. మరి ఇప్పుడు వాసాలమర్రికి వెళ్తే జనం మర్లవడి కొడుతున్నారు. కేసీఆర్‌ మాటలు నమ్మి తమ పరిస్థితి మబ్బుల్ని చూసి నీళ్లు ఒలకబోసుకున్నట్లైందని మండిపడుతున్నారు. సార్‌.. ఈసారి గెలిచేలా కూడా లేడు.. తమ దత్తత గ్రామం ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తమలా మరొకరు మోసపోవద్దని.. కేసీఆర్‌ కుర్చీని లాగేయాలని పిలుపునిస్తున్నారు.

కేసీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు దాటిపోయింది. ఆయన ఇచ్చిన మాట అలాగే ఉండిపోయింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆయన పదవి కూడా ఉంటుందనే గ్యారెంటీ లేకుండా పోయింది. ఏదో చేస్తారని నమ్మితే ఇలా చేశారేంటని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి వాసులు బోరుమంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామంగా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగింది. తాము కూడా వాసాలమర్రిలో పుట్టి ఉంటే బాగుండేదని జనం అంతా ఒకటే నిట్టూర్చారు. 2020 నవంబర్ 1న వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బంగారు వాసాలమర్రిగా మారుస్తానని అక్కడి ప్రజలకు మాట ఇచ్చారు. ఊరంతా ఇళ్లు పడగొట్టించి కొత్త లేవుట్‌ వేస్తానని చెప్పారు. ఊరంతా తళతళ మెరిసిపోయేలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తానని అన్నారు. ఇవే కాకుండా ఇంకా అనేక హామీలిచ్చారు గులాబీ అధినేత. మరి సీఎం మాట ఇచ్చిన మూడేళ్ల కాలంలో వాసాలమర్రి రూపురేఖలు ఏమైనా మారాయా? అంటే శూన్యమనే మాటే వినిపిస్తోంది.

వాసాలమర్రి గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1763 మంది ఉన్నారు. వీరిలో షెడ్యూల్ కులాల వారు 249 మంది, షెడ్యూల్ తెగల వారు 128 మంది ఉన్నారు. మిగతా వాళ్లు అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. 2020 నవంబర్ 1 దత్తత ప్రకటన చేసిన సీఎం కేసీఆర్‌.. 2021 జూన్ 22న మొదటిసారి వాసాలమర్రికి వెళ్లారు. గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం.. అనంతరం ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆగస్టు 4న ఇదే గ్రామం నుంచి దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 76 ఎస్సీ కుటుంబాల ఖాతాలో ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల నగదు జమ చేశారు. వాసాలమర్రి గ్రామంలో ప్రణాళికా బద్దంగా నూతన ఇళ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. వాసాలమర్రిని మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని సీఎం గొప్పలు చెప్పారు. ముఖ్యమంత్రి మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికి ఆ మాట నిలబెట్టుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కొత్త ఇళ్ల మాట దేవుడెరుగు.. తన ఫాంహౌస్‌ ఎర్రవెల్లికి వెళ్లేందుకు రోడ్డు కోసం తమ ఇళ్లు కూలగొట్టారని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

2022 మే 10న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. మోడల్ విలేజ్ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రజల అభిప్రాయాలు స్వీకరించకుండ గ్రామసభలో తీర్మానాన్ని ఏ విధంగా ప్రవేశ పెడతారని… ముందు గ్రామ పునర్నిర్మాణాన్ని చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే మోడల్ విలేజ్ తీర్మానం చేపట్టాలని పట్టుబట్టగా అధికారులు గ్రామసభను రద్దు చేసి వెళ్లిపోయారు. గ్రామంలో 494 గృహాలు ఉండగా వీటిలో 100కు పైగా పక్క ఇళ్లు ఉన్నాయి. మిగతావన్నీ పెంకుటిళ్లు.. సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ రోడ్డు కోసం ఇళ్లు పడగొట్టాడానికే మాస్టర్‌ ప్లాన్‌ నాటకం రూపొందించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పిస్తాననే హామీ నీళ్ల మూటగా మారిందని మండిపడుతున్నారు.

వాసాలమర్రి గ్రామాన్ని బంగారు వాసాలమర్రిగా తీర్చి దిద్దుతానన్న ముఖ్యమంత్రి మాటలు నమ్మిపోసపోయామని జనం నిట్టూరుస్తున్నారు. గ్రామం రూపురేఖలు మారిపోయి.. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని భావించామని గోడు వెల్లబోసుకుంటున్నారు. తమ గ్రామాన్ని ఇలా కేసీఆర్‌ కోలుకోలేకుండా దెబ్బతీస్తారని ఊహించలేదని వాపోతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యతని విస్మరించిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతామని వాసాలమర్రి గ్రామస్థులు ప్రతినిబూనారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇంత అరాచకం జరిగిందా? ఆప్ ప్రభుత్వం ప్రమాదంలో పడిందా?

Bigtv Digital

Chandrababu: కరకట్ట ఇల్లు జప్తు.. చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏసీబీ కోర్టు సంచలనం..

Bigtv Digital

Kotamreddy : కోటంరెడ్డికి చెక్ పెట్టగలరా? నెల్లూరు రూరల్ పై ఆదాల పట్టు పట్టగలరా?

Bigtv Digital

Leo Movie : లియో మూవీ కి ఝలక్ ఇచ్చిన స్టాలిన్ ప్రభుత్వం

Bigtv Digital

IPL : ఐపీఎల్ విజేత చెన్నై.. ఫైనల్ లో గుజరాత్ కు షాక్..

Bigtv Digital

Congress : నేడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ.. యూత్ డిక్లరేషన్ పై సర్వత్రా ఆసక్తి..

Bigtv Digital

Leave a Comment