BigTV English
Advertisement

CM Revanth Reddy: నిరుద్యోగులారా నేనున్నా.. ఉద్యోగ, ఉపాధి కల్పనే నా ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నిరుద్యోగులారా నేనున్నా.. ఉద్యోగ, ఉపాధి కల్పనే నా ధ్యేయం.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమకే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో బుధవారం ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా యువ వికాసం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రత్యేక స్టాల్స్ ను సభ వద్ద ఏర్పాటు చేశారు.


ఈ స్టాల్స్ లో ఆపరేషన్ గరుడ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, డీ.ఈ.ఈ.టి, ఏ.ఎల్.ఈ.ఏ.పి, టాస్క్, ఎన్.ఎస్.ఐ.సి, న్యాక్, టామ్ కామ్, యువజన క్రీడ శాఖ, సింగరేణి సంస్థ ద్వారా కూడా స్టాల్ ఏర్పాటు చేయగా, ముఖ్య మంత్రి పరిశీలించారు. అలాగే రూ. 1024 కోట్ల 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందరో నిరుద్యోగులు పోరాటం చేసి సాధించుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అవకాశాలను నిరుద్యోగులకు చేరువ చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించామని, అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువకుల్లో వృత్తి నైపుణ్యతను పెంపొందించే చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు.


Also Read: Mahalakshmi Foundation: ఆ ఊరే ఓ అద్భుతం.. ఆడపిల్ల పుడితే అక్కడి సంప్రదాయమే వేరు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో, ఉద్యోగాల ఊసే లేకుండా పరిపాలించిందని, తాము ఉద్యోగాలు ఇస్తుంటే యువకులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరించిందన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో తమ ప్రభుత్వంపై ఎన్నో దుష్ప్రచారాలు సాగిస్తున్నారని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం వాటికి సమాధానమన్నారు.

ఈ కార్యక్రమంలోనే గ్రూప్-4 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు యువ వికాసం సభా వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. సీఎం వెంట ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటి పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ లు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు రాష్ట్ర స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×