Adilabad-Dadar Special Trains: ఆయా అకేషన్స్ కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపడంలో భారతీయ రైల్వే ముందుంటుంది. పండగలు, ప్రత్యేక వేడుకల సందర్భంగా ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతుంది. త్వరలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాపరి నిర్వాన్ దివస్ జరగనున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 7 తేదీల్లో పత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లు ఆదిలాబాద్, దాదర్ నడుమ సేవలు అందిస్తాయని తెలిపింది. ఈ రైళ్లలో రిజర్వేషన్ తో పాటు అన్ రిజర్వ్ కోచ్ లు కూడా ఉంటాయని ప్రకటించింది.
డిసెంబర్ 6న మహాపరినిర్వాస్
డిసెంబర్ 6న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి. దీనినే మహాపరినిర్వాన్ దివస్ గా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుతారు. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఈసందర్భంగా మహాపరినిర్వాస్ కర్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, దాదర్ నడుమ ప్రయాణీకుల రద్దీ పెరగనుంది. అందుకు అనుగుణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదిలాబాద్- దాదర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసినట్లు ప్రకటించింది.
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు
ఈ నెల 5, 7 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను షెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ మేరకు నాందేడ్ డివిజన్ పీఆర్ఓ కీలక ప్రకటన చేశారు. స్పెషల్ రైలు ఈ నెల 5న ఆదిలాబాద్ నుంచి దాదర్‌కు 7 గంటలకు బయల్దేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దాదర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. ఆ తర్వాత దాదర్ నుంచి ఈ ప్రత్యేక రైలు శనివారం ఉదయం 1.05 గంటలకు బయల్దేరుతుంది. సాయంత్రం 6.45 గంటలకు ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
ఆదిలాబాద్-దాదర్ స్పెషల్ ట్రైన్ల రూట్
ఆదిలాబాద్-దాదర్ మధ్య నడిచే రెండు ప్రత్యేక రైళ్లు విస్తృతమైన రూట్ ను కవర్ చేస్తాయి. ఈ మార్గంలోని పలు స్టేషన్లలో హాలింగ్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ లో కిన్వాట్, హిమాయత్‌నగర్, భోకర్, ముద్ఖేడ్, హెచ్.ఎస్. నాందేడ్, పూర్ణా, పర్భాని, మన్వత్ రోడ్, సేలు, పార్టూర్, జాల్నా, ఔరంగాబాద్, లాసూర్, రోటేగావ్, నాగర్‌సోల్, అంకై, మన్మాడ్, నాసిక్, ఇగత్‌పురి, కళ్యాణ్ స్టేషన్లలో ఆగనున్నాయి.
ఆదిలాబాద్-దాదర్ ప్రత్యేక రైళ్ల కోచ్ లు
చ్లుఆదిలాబాద్-దాదర్ ప్రత్యేక రైళ్ల లో రిజర్వేషన్ కోచ్ లతో పాటు అన్ రిజర్వ్ కోచ్ లు ఉంటాయి. 14 కోచ్‌లు అన్ రిజర్వ్ కు సంబంధించినవి ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. అటు సాధారణ సెకండ్ క్లాస్ చైర్ కార్ కోచ్‌లు అమర్చబడి ఉంటాయన్నారు. ఈ కోచ్ లు అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెళ్లేందుకు అనుగుణంగా ఉంటాయని చెప్పారు.
Read Also: కాశ్మీర్ వందే భారత్‌కు ముహూర్తం ఫిక్స్.. టికెట్ ధర, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?