Saif Ali khan : రోజుకో మలుపు తిరుగుతున్న బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో తాజాగా పోలీసులు మహిళను అరెస్టు చేశారు పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ మహిళను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేసిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ కేసు ఎన్నో మలుపులు తీసుకోగా తాజాగా పశ్చిమ బెంగాల్ నాది ఒక చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే ఈ కేసులో ఇప్పటికే ఆలస్యం బంగ్లాదేశ్ కు చెందిన షరీఫ్ ఫుల్ వాడిన సిమ్ కార్డ్ ఏ మహిళ పేరుమీద రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది దీంతో ఆమెను విచారించేందుకు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు
ఈ దాడి కేసులో నదియా జిల్లా చప్రాకు చెందిన మహిళకు సైఫ్ పై దాడి చేసిన నిందితుడితో పరిచయం ఉండటంతో పాటు ఆ వ్యక్తి ఉపయోగించిన సిమ్ కార్డ్ ఆ మహిళదే అని తెలియడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా మహిళకు నిందితుడితో ముందు నుంచి పరిచయం ఉందని… నిందితుడు బంగ్లాదేశ్ నుంచి భారతంలోకి అక్రమంగా ప్రవేశించాడని.. అప్పటి నుంచి ఆ మహిళతో టచ్ లోనే ఉన్నాడని పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.
ALSO READ : సాయిపల్లవి ర్యాగింగ్..ఆమెతో చేయడం కష్టమని చేతులు ఎత్తేసిన డైరెక్టర్
ఇక సైఫ్ పై జనవరి 16న దాడి జరిగినప్పటి నుంచి పోలీసులు విచారణ మమ్మరం చేశారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటిన సైతం పరిశీలించారు. మహారాష్ట్ర సీఐడి విభాగంలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం సైఫ్ ఇంటిలో దాదాపు 19 వేల ముద్రలను సేకరించింది. కాగా ఇందులో ఏ వేలిముద్ర కూడా నిందితుడి ఫింగర్ ప్రింట్ తో మ్యాచ్ పోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఫోరెన్సిక్ బృందం సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుడి వేలిముద్రలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇలా దర్యాప్తు వేగంగా జరుగుతున్న సమయంలోనే ఈ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
జనవరి 16 తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడిన ఓ బంగ్లాదేశీయుడు అతడిపై దాడికి పాల్పడ్డాడు. సైఫ్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆరు చోట్ల కత్తిపోట్లకు గురయ్యాడు. దాడి చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఫుటేజీ ఆధారంగానే దర్యాప్తు జరిపిన పోలీసులు జనవరి 19న నిందితుడిని అరెస్టు చేశారు. ఇక దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ను వెంటనే లీలావతి ఆసుపత్రికి చేర్చడంతో వెన్నుముక, చేయికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సైఫ్ కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే పలు రకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో త్వరలోనే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ : జైలర్ 2 కోసం భారీ డిమాండ్.. ఎన్ని కోట్లంటే..?