Silambarasan’s Next : కోలీవుడ్ స్టార్ శింబు నెక్స్ట్ మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ హీరో స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన నెక్స్ట్ మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఆ పోస్టర్లో కేవలం నెక్స్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడు అనే విషయాన్ని వెల్లడించారు. అంతేకానీ డైరెక్టర్ ఎవరు అనే విషయాన్ని ఇంకా ఆయన చెప్పలేదు. ఆ క్రేజీ ఛాన్స్ ను ఓ యంగ్ డైరెక్టర్ కొట్టేశారని టాక్ నడుస్తోంది.
శింబు 33వ మూవీ అప్డేట్
కోలీవుడ్ స్టార్ శింబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ హీరోకి తెలుగులో కూడా ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా స్పీడ్ తగ్గించిన ఈ హీరో నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శింబు తన పుట్టినరోజు కానుకగా నెక్స్ట్ మూవీ అప్డేట్ ఉండబోతోంది అనే గుడ్ న్యూస్ చెప్పారు ఫ్యాన్స్ కి. ఫిబ్రవరి 3న శింబు 42వ పుట్టినరోజు.
గత రెండేళ్లుగా శింబు నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కానీ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో ఈ హీరో ఓ కీలకపాత్రను పోషిస్తున్నాడు. కానీ శింబు సోలోగా నటించే సినిమా గురించి ఆయన అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో 2021లో రిలీజ్ అయిన ఓ సినిమాలో శింబు కనిపించాడు. ఆ మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ అంతకుముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ నేపథ్యంలోనే శింబు నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
‘పార్కింగ్’ దర్శకుడికి జాక్పాట్
శింబు తన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘పార్కింగ్’ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాతో పాటు శింబు మరో రెండు సినిమాలు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు, దేశింగ్ పెరియాసామిల దర్శకత్వంలో శింబు తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడని టాక్ నడిచింది. కానీ పెరియాసామి దర్శకత్వంలో రూపొందాల్సిన భారీ బడ్జెట్ మూవీ ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఈ మూవీ బడ్జెట్ సమస్యల కారణంగా నిర్మాతగా కమల్ హాసన్ తప్పుకోవడంతో, శింబు నిర్మించానున్నారని అన్నారు. కానీ ఇప్పటిదాకా దీనికి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
అలాగే ప్రదీప్ రంగనాథన్ తో ‘డ్రాగన్’ సినిమాను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఆయన మరో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. కానీ ఇప్పుడు ‘పార్కింగ్’ డైరెక్టర్ ని లైన్ లోకి తీసుకురావడంతో, ఆయన అశ్వత్ మారిముత్తు ను వెయిటింగ్ లిస్టులో ఉంచబోతాడని అంటున్నారు. ఇక ఈ గందరగోళానికి తెరపడాలి అంటే శింబు గురించి నెక్స్ట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.