Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) తుది దశకు వచ్చింది. ఒక్క అడుగు దూరంలోనే విజేత ఎవరు అనేది క్లారిటీ వస్తుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జట్లు ఏవి అనేది కూడా తేలిపోయింది. జూన్ మూడో తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Punjab Kings ) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నిన్న ముంబై జట్టును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కి వెళ్లి… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడబోతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు.
Also Read: Priyansh Arya football: వాళ్ళు తన్నడం, వీడు తన్నించుకోవడం…అందరూ సరిపోయారు.. పిల్ల బచ్చాను చేసి
శశాంక్ సింగ్ ను బండ బూతులు తిట్టిన శ్రేయస్ అయ్యర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ దాదాపు రెండు గంటల పాటు ఆగిపోయి ఆ తర్వాత ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటలకు ఫలితం వచ్చింది. అయితే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో… పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వివాదంలో చిక్కుకున్నాడు. తమ సొంత ప్లేయర్ ను బండబూతులు తిట్టి అడ్డంగా దొరికిపోయాడు శ్రేయస్ అయ్యార్.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కు చేరిన తర్వాత.. కాస్త ఓవర్గా బిహేవ్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas iyer). మ్యాచ్ గెలిచిన తర్వాత ముంబై ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు… శ్రేయస్ అయ్యర్ ముందుకు వచ్చాడు. ఇలాంటి నేపథ్యంలోనే పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ ను ఉద్దేశించి.. పరుష పదజాలం వాడాడు. మాట్లాడలేని భాషలో బండ బూతులు తిట్టాడు శ్రేయస్ అయ్యర్. దీంతో ఏం చేసేది లేక శశాంక్ సింగ్ ( Punjab Kings Shashank Singh) నేలకు… ముఖం వేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శశాంక్ సింగ్ ను తిట్టడం వెనుక కారణం?
పంజాబ్ ఆటగాడు శశాంక్ సింగ్ ను శ్రేయస్ అయ్యర్ తిట్టడం వెనుక పెద్ద కారణమే ఉంది. కీలకమైన మ్యాచ్ సమయంలో… శశాంక్ సింగ్ నిర్లక్ష్యంగా రన్ అవుట్ అయ్యాడు. అయితే అప్పుడు సీరియస్ కానీ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ పూర్తయిన తర్వాత మాత్రం అతనిపై పగ తీర్చుకున్నాడు. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా… శశాంక్ సింగ్ ను బూతులు తిట్టాడు శ్రేయస్ అయ్యర్. నీ ముఖం నాకు చూపించొద్దు అన్నట్లు అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియో వైరల్ అవుతుంది.
#PBKSvsMI Shreyas Iyer angry on Shashank for His absence in running between games …#shreyasiyer pic.twitter.com/IQlyZYXfdV
— Ganesh Barad (@GBarad) June 1, 2025