Indira Soura Giri Jala Vikasam: నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందిరా సౌర గిరి జల వికాస పథకానికి రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. రైతులందరికీ సోలార్ పంపు సెట్లను ఫ్రీగా ఇస్తామన్నారు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.
సోలార్ ప్యానెళ్లతో వ్యవసాయానికి పోనూ.. నెల నెల ఆదాయం వచ్చేలా ఉండాలని అధికారులకు సూచించారు సీఎం. గ్రిడ్‌కు ఎలా కనెక్ట్ చేయాలో అధికారులు ప్లాన్ చేయాలన్నారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆదేశించారు. వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ పంపుసెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సూచించారు
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న చెంచులకు ఈ పథకం ద్వారా చేయూత అందించనుంది ప్రభుత్వం. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో సోలార్ పంపుసెట్ల ద్వారా నీరు అందించాలనేది ఈ పథకం లక్ష్యం. విద్యుత్ సదుపాయం లేని పోడు భూములకు పూర్తి రాయితీతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి నీరు అందించనున్నారు.
రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాస ఈ పథకాన్ని తీసుకొచ్చింది. పోడు భూములకు పంపుసెట్ల ద్వారా నీళ్లు అందించేందుకు.. ఒక్కో యూనిట్‌కు 6లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి 12,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదట 600 కోట్లు.. అనంతరం ఒక్కో ఏడాదికి 3వేల కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయనున్నారు.
Also Read: చెంచులకు రేవంత్ చేయూత.. కొత్త పథకం తో 6 లక్షల ఎకరాలకు సాగునీరు
నల్లమల నుంచి అటవీ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దాదాపు పదివేల మంది చెంచులు లబ్దిపొందనున్నారు. మాచారంలో ఉన్న దాదాపు 50 చెంచు కుటుంబాలు ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ద్వారా లబ్దిపొందనున్నారు. 175 ఎకరాల్లో వివిధ పండ్ల తోటల సాగుకు తోడ్పాటు అందించనున్నారు. ఐదేళ్లలో ఆరు లక్షల ఎకరాలల్లో పోడు భూములకు సాగు నీరు అందించనున్నారు.