CM Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో టీచర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామ గ్రామానికి జైతెలంగాణ అనే నినాదాన్ని చేరవేసింది టీచర్లే అని కొనియాడారు. ఈ రోజు శిల్పకళావేదికలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సిన అవరసం ఉందని చెప్పారు. చాలా చోట్ల కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందడం లేదని తెలిపారు. పదేళ్లుగా ఉన్న సమస్యలన్నింటినీ తీర్చడానికే విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్నట్టు సీఎం చెప్పారు.
ALSO READ: PGCIL Recruitment: పవర్ గ్రిడ్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే లక్షకు పైనే, లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
అందుకోసమే నా దగ్గర విద్యాశాఖ ఉంచుకోవాలని నిర్ణయం..
గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వీసీని కూడా నియమించలేదు. మేం వచ్చాక సోషల్ జస్టిస్ విత్ మెరిట్ తో వీసీని నియమించాం. విద్య పట్ల, పేదల పిల్లల పట్ల టీచర్లు బాధ్యతగా ఉంటున్నారు. కాంట్రవర్సీ అయినా పర్వా లేదు.. శాఖ నా దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు చేయాలని కమిటీ వేశాం..
‘కొందరు విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతున్నారు.. పేదల పిల్లలకు ప్రభుత్వ స్కూల్స్ లో మెరుగైన విద్య అందాలి.. కార్పొరేట్ విద్య కంటే సర్కార్ స్కూల్స్ లో నాణ్యమైన విద్య అందిద్దాం. ప్రపంచ దేశాలతో విద్యలో మనం పోటీపడాలి. ప్రతి ఏటా 200 మంది టీచర్లను విదేశాలకు పంపి ట్రైనింగ్ ఇప్పిస్తాం.. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు చేయాలని కమిటీ వేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.