BigTV English
Advertisement

CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. ఇదికదా ప్రజా ప్రభుత్వం అంటే: సీఎం రేవంత్

CM Revanth Reddy: దేశంలోనే తెలంగాణ నంబర్ వన్.. ఇదికదా ప్రజా ప్రభుత్వం అంటే: సీఎం రేవంత్

CM Revanth Reddy: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరుగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు ఆశీర్వాదం లేకపోతే ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


‘ఎమ్మెల్యేగా గెలవాలన్నా, పార్లమెంటుకు వెళ్లాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా రైతులు అండగా ఉంటేనే సాధ్యం. గతంలో పదవులు అనుభవించినవాళ్లు, పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయనివారు వీధి వీధినా నాటకాలకు బయలుదేరారు. పదేళ్ల పాలనలో నెత్తిమీద అప్పు… చేతిలో చిప్ప పెట్టారు. వాళ్లు పదేళ్లలో చేసిన విధ్వంసం వందేళ్లయినా కోలుకోలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్ధిక వ్యవస్థగా మార్చి మనకు అప్పగించారు. అద్దాల మేడలు కట్టి, రంగుల గోడలు చూపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చారు’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ALSO READ: RAITHU BHAROSA: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎకరాలతో సంబంధం లేకుండా రైతుభరోసా నిధులు విడుదల


వరి వేసుకుంటే ఉరే అని చెప్పింది ఆనాటి ప్రభుత్వం. వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని చెప్పిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రైతులను సన్న వడ్లు పండించేందుకు ప్రోత్సహించాం. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ప్రకటించి రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించాం. మీరు సన్న వడ్లు పండించడం వల్లే ఇవాళ పేదలకు సన్నంబియ్యం అందించగలుగుతున్నాం. వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి’ అని సీఎం వ్యాఖ్యానించారు.

పదేళ్లలో 8లక్షల 20 వేల కోట్ల అప్పు మా నెత్తిపై మోపి నడుం వంగిపోయే పరిస్థితి తెచ్చారు. అప్పులు మన నెత్తిపై పెట్టి ఇవాళ మనల్ని విమర్శలు చేస్తున్నారు. ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ… ముందుకు వెళుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించేందుకు ఇక్కడికి వచ్చాం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. 18 నెలల్లోనే రైతుల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఏ గ్రామంలోనైనా సవాల్ విసురుదాం.. గ్రామ సభలు పెడదాం, గ్రామాల్లో చర్చ పెడదాం. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మ గౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పించాం. చావుల పునాదులపై అధికారంలోకి రావాలని దురాలోచనతో ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది’ అని అన్నారు.

కొంత కాలమైనా సమయం ఇవ్వరా.. ? సరిదిద్దుకొనివ్వరా? భార్యాభర్తలు మాట్లాడుకున్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను కల్పించాం. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మీ భవిష్యత్ బాగుంటేనే మాకు ఆనందం. ఆ దిశగా మిమ్మల్ని తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. రైతులకు సోలార్ పంపుసెట్లతో ప్రయోజనం, వాణిజ్య పంటలు, ఇతర పంటలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఈ వేదికగా ఆదేశిస్తున్నా. రైతులు పంట మార్పిడి చేయండి. భూమి రైతుకు ఆత్మగౌరవం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా, బట్టలు చించుకున్నా పదేళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. రాష్ట్రాన్ని బొందల గడ్డగా మార్చిన వాళ్లు సిగ్గులేకుండా మనల్ని విమర్శిస్తున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు.

Related News

KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?

Maganti Family Issue: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టి షాక్.. సునీతకు వ్యతిరేకంగా ఏకమైన మాగంటి ఫ్యామిలీ

Hyderabad: జగద్గిరిగుట్ట రౌడీ షీటర్ హత్య కేసులో 24 గంటల్లోనే వీడిన మిస్టరీ!

Bandi Sanjay: బోరబండ రోడ్ షో రగడ.. పోలీసులు ఎంఐఎం తొత్తులా?, బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Wine Shops Closed: మద్యం ప్రియులకు బిగ్‌ షాక్.. 4 రోజులు వైన్‌ షాపులు బంద్‌.. కారణం ఇదే..!

Hyderabad Metro: చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణ మ్యాప్‌ను సమర్పించండి: హై కోర్టు కీలక ఆదేశం

CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఫోకస్‌.. సీఎం రేవంత్‌ కీలక సమావేశం

Maganti Gopinath Family Dispute: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్

Big Stories

×