CM Revanth Reddy Tweet: తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తర్వాత నిరుద్యోగం తగ్గిందా? కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేటు ఉద్యోగాలు యువతకు వస్తున్నాయా? తెలంగాణలో నిరుద్యోగం తగ్గిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది సందర్భంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో బుధవారం ‘యువ వికాసం విజయోత్సవం’ కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. కొలిమిలా మండిన ఉద్యమం.. నేడు కొలువుల కలలు నిజమైన క్షణమని రాసుకొచ్చారు. ప్రజా పాలనలో యువ వికాస వసంతం, ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామకం జరిగిందన్నారు. నిత్య నోటిఫికేషన్ల తోరణం, ఏడాది ప్రజా పాలనలో తగ్గుతున్న నిరుద్యోగమని రాసుకొచ్చారు. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు పెద్దపల్లికి వస్తున్నానని పేర్కొన్నారు. దానికి ఓ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ను జత చేశారు.
ఇంతకూ సీఎం రేవంత్‌రెడ్డి జత చేసిన ఆర్టికల్ సారాంశం ఏంటంటే.. తెలంగాణ యువతలో క్రమంగా నిరుద్యోగం తగ్గుతోంది. కేంద్ర జాతీయ కార్మిక శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం.. గతేడాది జూలై- సెప్టెంబర్‌తో పోల్చితే ప్రస్తుత నిరుద్యోగం రేటు 22.9 నుంచి 18.1 శాతానికి తగ్గినట్టు ప్రస్తావించింది.
ALSO READ: తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. భయాందోళనలో నగరవాసులు
కేవలం ఆరునెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు 6.6 శాతంగా నమోదు అయ్యింది. దక్షిణ భారత్‌లో సగటు నిరుద్యోగ రేటు కేరళలో 10.1 శాతం ఉండగా, ఏపీ 7.3 శాతంలో రెండో స్థానంలో నిలిచింది.
దేశంలో అత్యల్ప నిరుద్యోగ శాతం శాతం ఢిల్లీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. తర్వాత కర్ణాటక ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నిరుద్యోగ శాతం గమనిస్తే.. తెలంగాణ పదో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణలో నిరుద్యోగం క్రమంగా తగ్గుతుందనే చెప్పాలి.
మొన్న కొలువులే ఆలంబనగా…
కొలిమిలా మండిన ఉద్యమం…నిన్న కొలువులే ఆకాంక్షగా…
జంగ్ సైరనై మోగిన నా రణం.నేడు కొలువుల కలలు …
నిజమైన క్షణం.ప్రజా పాలనలో…
యువ వికాస వసంతం.
ఏడాది లో 55 వేల ఉద్యోగ నియామకం.
నిత్య నోటిఫికేషన్ల తోరణం…
ఏడాది ప్రజా పాలనలో…
తగ్గుతున్న నిరుద్యోగం.— Revanth Reddy (@revanth_anumula) December 4, 2024