Bangladesh Delhi Jama Masjid| బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఢిల్లీ జామా మసీదు షాషి ఇమాం సయ్యద్ అహ్మద్ బుఖారి ఖండించారు. హింసాత్మక ఘటనలను నివారించేందుకు ఇకనైనా చర్యలు చేపట్టాలి ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మొహమ్మద్ యూనుస్ ని బుధవారం ఒక లేఖ రాశారు. లేఖలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య స్నేహ సంబంధాల ప్రాముఖ్యం గురించి ప్రస్తావించారు.
“బంగ్లాదేశ్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన సమయం నుంచి భారత దేశ ప్రభుత్వం, రాజకీయ నాయకులు, ప్రజలు, వ్యాపారవేత్తులు బంగ్లాదేశ్ తొలి ప్రధాన మంత్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్, ఆయన కూతురు షేక్ హసీనా, వారి రాజకీయ పార్టీ అవామీ లీగ్ పార్టీతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. అంతర్జతీయ రాజకీయాలు, దౌత్య విధానాల్లో కూడా ఇరు దేశాలు ఎప్పుడూ కలిసికట్టుగానే ఉన్నాయి. మిత్రదేశాలుగానే మెలిగాయి.
Also Read: కొరియాలో సైనిక పరిపాలన.. కూలిపోవడానికి అడుగుదూరంలో ప్రభుత్వం
అయితే ప్రస్తుతం రాజకీయాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో రాజకీయాల ఆంతరంగిక విషయం. కానీ అక్కడ మైనారిటీలపై, హిందువు దేవాలయాలపై దాడులు జరగడాన్ని ఖండిస్తున్నాను. ఇది వెంటనే ఆగిపోవాలి. ఇలాంటి ఘటనలు ఏ విధంగానూ న్యాయబద్ధం కాదు. బంగ్లాదేశ్ లో ఎవరి ప్రభుత్వం ఉన్నా.. ఆ దేశం అస్తితత్వంలో, అభివృద్ధితో భారతదేశం కీలక పాత్ర పోషించింది. బంగ్లాదేశ్ లో ఏదైనా సంక్షోభం తలెత్తితే.. అక్కడి నుంచి వారు ఇక్కడ శరణార్థులుగా ఆశ్రయం పొందుతున్నారు. ఏ ప్రకృతి విపత్తు వచ్చినా బంగ్లాదేశ్ కు సాయం చేయడానికి ఇండియా ముందుంటుంది.” అని షాహి ఇమాం బుఖారి లేఖలో ప్రస్తావించారు.
ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ మైనారిటీలకు సమాన హక్కులు ఇవ్వాలనే నిబంధనలు గుర్తు చేశారు. ఇరు దేశాల సంప్రదాయాల్లో సారూప్యం ఉండడంతో తాను ఢిల్లీ ముస్లింల ప్రతినిధిగా బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. నోబెల్ అవార్డు గ్రహీత ప్రస్తుత బంగ్లాదేశ్ మధ్యంతర చీఫ్ మొహమ్మద్ యూనుస్ వెంటనే చర్యలు చేపట్టాలి. బంగ్లాదేశ్ పరువు అంతర్జాతీయ స్థాయిలో దిగజారిపోకుండాం ఆయన జాగ్రత్త పడాలి. ఒక ముస్లిం దేశంలో ఇస్లాం చట్టాలకు వ్యతిరేకంగా మైనారిటీలపై దాడులు జరగడానికి వీల్లేదని ఇమాం బుఖారి అన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న ఇస్కాన్ సభ్యులు 60 మందిని గతవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారంతా బంగ్లాదేశ్ వదిలి బేనాపోల్ పోర్ట్ మార్గాన భారతదేశానికి వెళుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారని ఇస్కాన్ ప్రతినిధి తెలిపారు. ఇస్కాన్ పూజారి చిన్మోయి కృష్ణ దాస్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయనపై దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. బంగ్లాదేశ్ కోర్టు చిన్మోయి కృష్ణ దాస్ కేసు విచారణ జనవరి 2, 2025కు వాయిదా వేసింది.