Big Stories

CM Revanth Reddy Visits KCR : యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌‌కు పరామర్శ..

CM Revanth Reddy Visits KCR : సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లారు. కాలుజారి కిందపడి తుంటి ఎముక విరగడంతో.. సోమాజిగూడ యాశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు సర్జరీ చేశారు. తుంటి ఎముక విరిగి చికిత్సపొందుతున్న కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ఉన్నారు. అంతకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రిలో కేటీఆర్ ను కలసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసారు.

- Advertisement -

కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని.. త్వరగా అసెంబ్లీకి రావాలని కోరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్ కోలుకునే వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వానికి సూచనలు.. సలహాలు ఇవ్వాలని కేసీఆర్ ను కోరినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

గురువారం రాత్రి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లోని బాత్ రూంలో కాలు జారి కింద పడ్డారు మాజీ సీఎం కేసీఆర్‌. దీంతో ఆయనకు గాయాలు కావడంతో హుటా హుటిన హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ పరీక్షలు జరిపిన డాక్టర్లు తుంటి ఎముక విరిగిందని నిర్ధారించి, సర్జరీ చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఎర్రవల్లి నుంచి ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసారు.

హెల్త్ సెక్రటరీని యశోద ఆసుపత్రికి పంపారు సీఎం రేవంత్‌రెడ్డి. ముఖ్యమంత్రి ఆదేశాలతో.. యశోద హాస్పిటల్ కు వెళ్లారు ఆరోగ్యశాఖ కార్యదర్శి. అక్కడి వైద్యులను కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి తెలిపారు యశోద వైద్యులు. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరామర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News