CM Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు సీఎం రేవంత్.. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగే ఈ సదస్సుకి పలు అజెండాలతో ఆయన వెళ్లనున్నారు. 2047 నాటికి సాధించాలనుకున్న లక్ష్యాలు, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లు, కుల గణన వంటి కీలక అంశాలను నీతి ఆయోగ్ గవర్నెన్స్ సమావేశంలో ప్రస్తావించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 ఎజెండాతో తెలంగాణ రైసింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించనున్నారు. పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ తో ముందుకు సాగుతున్న తీరును తెలపనున్నారు.ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను నీతి ఆయోగ్‌లో వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఐటీ, ఫార్మా అర్బనైజేషన్‌లో టాప్‌లో ఉన్న తెలంగాణ.. వాటిలో మరింత వేగంగా ముందుకు పోయేందుకు చేపడుతున్న చర్యలను తెలనున్నారు.మౌలిక సదుపాయాల కల్పన, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, డ్డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆవశ్యకతను తెలపనున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటిఐలను ఏటీసీలుగా మార్చి యువతకు నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం తీసుకున్న చొరవను గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముందు వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకున్న చర్యలు రుణ మాఫీ , సన్న బియ్యం, రైతులకు బోనస్, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పథకం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత విద్యుత్ సరఫరా, 500 కే సిలిండర్ సరఫరా వంటివి రాష్ట్రంలో నిరుపేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయునున్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సక్సెస్‌పుల్‌గా కొనసాగుతుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన.. నేడు ఢిల్లీలోని ప్రగతి భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవనున్నారు. ఈ సదస్సులో ఏపీ విధాన రోడ్ మ్యాప్‌ను సమర్పించనున్నారు.పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న అంతర్రాష్ట్ర వివాదాలు,మోళిక సదుపాయాలు, ఏపీ అభివృద్దికి కావాల్సిన సహాయ సహకారాలను కోరనున్నారు.
Also Read: ఆ దెయ్యాలు వీళ్ళే.. కవిత లెటర్‌పై.. అద్దంకి కామెంట్స్
మొదటి రోజు పర్యటనలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, జితేందర్ సింగ్, సి ఆర్ పాటిల్, నిర్మలా సీతా రామన్, అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రాష్ట్ర అభివృద్ధికి, నిధుల విడుదలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.విభజన చట్టాన్ని సవరించి రాజధానిగా అమరావతిని గుర్తించమని అమిత్ షాను కోరారు. లేపాక్షి- ఓర్వకల్లు ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు స్థాపనకు కేంద్ర సహకారం అడిగారు. రాష్ట్రానికి ఏరో స్పేస్ ప్రాజెక్టులు కేటాయించమని కేంద్రాన్ని కోరామని చెప్పారు.