Ration Cards News: కొత్త రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇంతకీ నార్మల్ కార్డులు ఇస్తారా? లేకుంటే స్మార్ట్ కార్డులు ఇస్తారా? అనేదానిపై తర్జనభర్జన కొనసాగుతోంది.
పేద కుటుంబాలు హ్యాపీగా ఉండాలంటే రేషన్ కార్డు ఉండాలి. లేకుంటే ప్రభుత్వ పథకాలను పొందలేదు. అందుకే రేషన్ కార్డులు గురించి ఈ చిన్న వార్త వచ్చినా ప్రజలు వాటిని రిసీవ్ చేసుకుంటారు. జులై 14న సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వెళ్లి అక్కడ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలుకానుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దశాబ్దంపైగానే ఎదురుచూస్తున్నారు. జనవరి 26 న ప్రభుత్వం ప్రారంభించింది. అనేక కారణాల వల్ల కొత్త రేషన్ కార్డులు పేదలకు చేరలేదు. ఎప్పటికప్పుడు దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తోంది. అందుకు ఎలాంటి గడువు విధించలేదు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతమున్న రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చు కూడా.
కొత్త రేషన్ కార్డుల్లో ఆనందాలు మిన్నంటాయి. ప్రజలు కూడా తప్పక తీసుకోవాలి. ఆధునిక టెక్నాలజీతో రేషన్ స్మార్ట్ కార్డులను గా రూపొందించినట్టు తెలుస్తోంది. ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయి. అలాగే బార్ కోడ్, QR కోడ్‌లు ఉంటాయి. రేషన్ సరుకులు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా తీసుకోవచ్చు. రేషన్ డీలర్లు కార్డును స్కాన్ చేసి సరుకులు ఇవ్వనున్నారు.
ALSO READ: బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందా?
కొత్త కార్డులకు ముందుభాగంలో తెలంగాణ ప్రభుత్వ లోగోతోపాటు సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలు ఉండనున్నాయి. ముఖ్యంగా కార్డులకు e-KYC పూర్తి చేసి ఉంటుంది. ఆధార్ కార్డుతో లింక్ కావడంతో రేషన్‌కి సంబంధించి ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి అక్రమాలకు ఛాన్స్ ఉండదు. జులై 14 నుంచి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ తరచూ జరుగుతుంటుంది.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో ప్రభుత్వం అదనపు భారం పెరుగుతుంది. అందుకే పాలకులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో ప్రస్తుతం ప్రతీది ఆధార్‌కు లింకు కావడంతో ఎలాంటి సమస్య ఉండదని ప్రభుత్వం అంచా. మరో మూడు నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్నాయి.
ఈలోగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం ప్రభుత్వానికి మంచిదేనని కొందరు ప్రభుత్వ పెద్దల మాట. అది ప్రభుత్వానికి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నెగిటివ్ అవుతుందని అంటున్నారు. దశాబ్దంపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కొత్త కార్డుల గురించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పథకాలు లబ్ది పొందలేదు.
గత ఎన్నికల్లో కారు పార్టీ ఓటమికి ఇదీ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులపై దృష్టి సారించింది. జనవరి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావడంతో పంపిణీ చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.