BigTV English

Indiramma Houses Scheme: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. రేపే ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన

Indiramma Houses Scheme: రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. రేపే ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన

Indiramma Houses Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ సూపర్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతి ముఖ్యమైన హామీల్లో ఒక్కటి ఇందిరమ్మ ఇళ్లు. రాష్ట్రంలో చాలా మంది మధ్య తరగతి కుటుంబీకులు, పేదలు ఈ స్కీం అమలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు తీపి కబురును అందించింది.


ALSO READ: Bank of Baroda: డిగ్రీ అర్హతతో 4000 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో కూడా ఖాళీలు.. ఇంకెందుకు ఆలస్యం

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణ ప్రభుత్వం వడపోతల ద్వారా చివరకు అర్హులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రేపు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. రేపు సీఎం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట మండలం అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రం మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు.


ALSO READ: Indian Post Office: పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు.. NO EXAM.. డైరెక్ట్ జాబ్..

72,045 ఇందిరమ్మ ఇళ్ల విడుదల..

మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్ల విడుదల కాగా.. వాటన్నింటికి రేపు శంకుస్థాపన పనులు ప్రారంభం కానున్నాయి. ఇల్లు లేని కుటుంబాల అందరికీ ఇళ్లు మంజూరు చేయాలనే ప్రభుత్వం సంకల్పంలో భాగంగా లబ్దిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఇచ్చారు. మొతం ఇళ్లు నిర్మాణం పూర్తి అయ్యే వరకు రూ.5లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. మొదట ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్ మెంట్ నిర్మించగానే రూ.లక్ష లబ్దిదారుని ఖాతాకి జమచేస్తారు. డబ్బులు విడుదల అయ్యేలా ఏర్పాట్లను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది.

ALSO READ: Group-2 Mains: గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదాపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ క్లారిటీ..

ఈ విధంగా డబ్బులు జమ..

బేస్ మెంట్ నిర్మించిన తర్వాత రూ.లక్ష లబ్దిదారుడి అకౌంట్ కు జమచేస్తారు. స్కీంలో భాగంగా ఆ తర్వాత కిటికీలు, తలుపులు, గోడలూ నిర్మించుకోవాలి. అప్పుడు అధికారులు పరిశీలించి లబ్దిదారుడి అకౌంట్ కు రూ.1.25 లక్షలు జమచేస్తారు. అనంతరం జమ అయిన డబ్బుతో స్లాబ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పడు అధికారుల పరిశీలించాక రూ.1.75 లక్షలు అకౌంట్ కు జమచేస్తారు. ఈ డబ్బుతో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది.  తర్వాత చివరిగా ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1 లక్ష లబ్దిదారుడి అకౌంట్ కు జమ చేస్తోంది. దీంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రక్రియ పూర్తి అవుతుంది.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×