Bapu Ghat: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీకి ప్రముఖులు నివాళులు అర్పించారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌లో నివాళులు అర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ , సీఎం రేవంత్‌రెడ్డి. అక్కడే కూర్చుని కాసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత పాఠశాల పిల్లలతో ముచ్చటించారు.
వీరితోపాటు పలువురు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉన్నతాధికారులు ఉన్నారు.
మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
గాంధీ వర్ధంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ pic.twitter.com/TUb8amSHTj
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2025