CM Revanth Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో అడ్డుకుంటున్నారని సీఎం సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ పార్ట్‌నర్స్ అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ALSO READ: Assam Rifles Recruitment: టెన్త్, ఐటీఐ, పాలిటెక్నిక్ అర్హతలతో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..
కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని అనుమానించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తనకు మంచి పేరు వస్తుందని కిషన్ రెడ్డి ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై కూడా సీఎం స్పందించారు. 2014 నుంచి 2024 వరకు ఉన్నా రాజ్యాంగ చట్టాలే ఇప్పుడు కూడా ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇవ్వలేదా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడు జరగని ఉపఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ఆయన నిలదీశారు.
రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని కేసీఆర్, కేటీఆర్ చెప్పడం హస్యాస్పదంగా ఉందని సీఎం అన్నారు. కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్ట్‌నర్ అని అన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు తీసుకువస్తే కిషన్ రెడ్డికి ఘనంగా సన్మానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి సహకరించాలని సీఎం తెలిపారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్‌రోడ్, డ్రైపోర్టు, రక్షణరంగ ప్రాజెక్టులకు సహకరించాలి అని ప్రధాని మోదీని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీకి కోరిన ఆ 5 విజ్ఞప్తులను సాధించుకొని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన వంతుగా చేయాల్సింది అంతా చేశానని అన్నారు. అవన్నీ తీసుకొచ్చి క్రెడిట్ వాళ్ల సొంతం చేసుకోవచ్చునంటూ ఎద్దేవా చేశారు. కేంద్రానికి తాను చేసిన ఐదు ప్రాజెక్టులు కిషన్ రెడ్డి సాధిస్తే బహిరంగ సభ ఏర్పాటు చేసి వారికి సన్మానం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత టార్గెట్ ?