CM Revanth Reddy: వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది కామారెడ్డి జిల్లాలో వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, కాలనీలను పరిశీలించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది…
పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయ్యాయని, పంటలతో పాటు ఇండ్లు కూడా వరదల్లో మునిగిపోయి ఇబ్బందులు పడ్డామని సీఎం రేవంత్ రెడ్డి రైతులు వివరించారు. రైతులు, గ్రామస్థులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. విభాగాల వారీగా వరద నష్టంపై పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మీకు అండగా నిలిచి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం అన్నారు.
మీ ఎమ్మెల్యే దగ్గరుండి ఆదుకున్నారు…
కష్టం వచ్చినపుడు అండగా ఉండే వాడే నాయకుడని అన్నారు. మీకు అండగా ఉండి ఎమ్మెల్యే ఆదుకున్నారని చెప్పారు. ‘కష్టాల్లో ఉన్నపుడు ప్రజలకు తోడుగా ఉండాలని నాయకులకు సూచిస్తున్నా. వరదలకు మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడి మిమ్మల్ని కాపాడింది. తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేశాం. ప్రత్యక్షంగా మీ కష్టాలను, జరిగిన నష్టాలను చూడటానికే ఇక్కడకు వచ్చాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ALSO READ: LIC Jobs: ఎల్ఐసీలో భారీగా ఉద్యోగాలు.. భారీ శాలరీ, దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు
అందుకోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాం..
శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పంటపొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తాం. పంట నష్టపరిహారం అందిస్తాం. రోడ్లు, ప్రాజెక్టులను మరమ్మతులు చేసేందుకు అధికారులు అంచనాలు రూపొందించాలి. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తిస్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలి’ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ALSO READ: Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు.. వెంటనే అప్లై చేసుకోండి..
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా…
మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అధికారులు ప్రజలకు అండగా నిలిచి భారీ నష్టం జరగకుండా చూశారని సీఎం అన్నారు.. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా శాశ్విత పరిష్కారం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.