Fukang Meteorite: ఆకాశం నుంచి తరచుగా భూమ్మీద ఉల్కలు పడుతూనే ఉంటాయి. అలాగే 2000 సంవత్సరంలో చైనాలోని ఫుకాంగ్ సమీపంలో ఫుకాంగ్ ఉల్కను శాస్త్రవేత్తలు గురించారు. దీనిపై అనేక పరిశోధనలు చేశారు. చివరకు ఈ ఉల్క వయసుపై ఓ అంచనాకు వచ్చారు. భూమి ఏర్పడటానికి ముందు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఉల్క ఏర్పడినట్లు తేల్చారు. ఇది పీర్ రివ్యూడ్ అధ్యయనాలలో ఉపయోగించిన రుబిడియం స్ట్రోంటియం వ్యవస్థ లాంటి ఐసోటోపిక్ డేటింగ్ పద్ధతుల ద్వారా వయసును నిర్థారించినట్లు వెల్లడించారు. ఇది పల్లసైట్రకం ఉల్క. రాతి-ఇనుము ఉల్కల వర్గానికి చెందినది. ఇందులో ఒలివిన్ క్రిస్టల్స్, నికెల్-ఇనుము మిశ్రమం ఉంటాయి. ఇది సౌర వ్యవస్థ ఏర్పడిన సమయానికి సంబంధించినది.
చైనాలో ఫుకాంగ్ ఉల్క గుర్తింపు
ఫుకాంగ్ ఉల్క గురించి దీనిని చైనాలోని గోబీ ఎడారిలో ఫుకాంగ్ సమీపంలో గుర్తించారు. కనుగొనబడినప్పుడు దీని బరువు సుమారు 1,003 కిలోలుగా ఉంది. ఈ ఉల్కలోని ఒలివిన్ క్రిస్టల్స్ అర్ధపారదర్శకంగా ఉన్నాయి. ఇవి కాంతి పడినప్పుడు బంగారు-ఆకుపచ్చ రంగులో మెరుస్తాయి. ఇది ఒక స్టెయిన్డ్ గ్లాస్ లాంటి రూపాన్ని ఇస్తుంది. ఇనుము-నికెల్ మిశ్రమంతో కూడి ఉంటుంది.
2008లో ఫుకాంగ్ ఉల్క వేలం
2008లో ఈ అరుదైన ఫుకాంగ్ ఉల్కలోని 420 కిలోల భాగాన్ని న్యూయార్క్ లోని బోన్ హామ్స్ వేలంలో ఉంచారు. దీని ధర సుమారు 2 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఆ వేలంలో దీనిని ఎవరూ కొనుగోలు చేయలేదు. చిన్న ముక్కలు, స్లైస్ లు కలెక్టర్లకు, మ్యూజియంలకు అమ్మారు. కొన్ని గ్రాముకు 1,000 డాలర్ల వరకు ధర పలికాయి.
https://t.co/jJmaOKJzlm https://t.co/VPMjc8GnVU
— Elon Musk (@elonmusk) September 2, 2025
Read Also: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?
ఫుకాంగ్ ఉల్క ప్రాముఖ్యత ఏంటి?
ఫుకాంగ్ ఉల్క అరుదైన పల్ల సైట్ల వర్గానికి చెందినది. ఇవి గ్రహశకలాలలోని కోర్ మాంటిల్ సరిహద్దు నుంచి ఏర్పడినవి. ఇది సౌర వ్యవస్థ ఏర్పాటు, గ్రహాల ఏర్పాటు ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ఈ ఉల్కను మొదట స్థానిక హైకర్ కనుగొన్నాడు. అతను దీనిపై తరచూ భోజనం చేసేవాడు. దీని లోహం, క్రిస్టల్స్ గురించి ఆలోచించేవాడు. చివరికి అతడు దీని నమూనాలను అమెరికాకు పంపి ఉల్కగా గుర్తించాడు. ఫుకాంగ్ ఉల్కలోని ఒలివిన్ క్రిస్టల్స్ లో కొన్ని పెరిడాట్ రాయిగా గుర్తించారు. ఈ ఉల్క పెద్ద స్లైస్ లు అమెరికాలోని స్మిత్సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ లాంటి మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. ఫుకాంగ్ ఉల్క అందం, అరుదైన లక్షణాల కారణంగా ఇది అత్యంత విలువైనదిగా గుర్తించారు. EBay, Etsy లాంటి ప్లాట్ ఫారమ్ లలో చిన్న ముక్కలు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కానీ, ధర చాలా ఎక్కువ.
Read Also: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి