Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడుతున్నారా? లేకుంటే సొంత పార్టీలో కొనసాగుతారా? ఈ విషయంలో చాలామంది, ఆమె ప్రత్యర్థులు ఓ తరహా ప్రచారం మొదలుపెట్టారు. అవన్నీ నోటిమాటలేనని తేలిపోయింది. పార్టీ వ్యవహారాలపై క్లారిటీ ఇచ్చేసింది ఎమ్మెల్సీ కవిత.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పార్టీలో జరుగుతున్న వ్యవహారాల గురించి రాసిన లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. ఆ లేఖ ఎలాగ బయటికి వచ్చిందో తెలీదు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిందని కవిత, ఆమె మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. పార్టీ వ్యవహారాల గురించి ఆమె ఏనాడు బయటపెట్టలేదు. ‘ఆఫ్ ద రికార్డు’లో మాత్రమే ఆమె చెబుతూ వచ్చారు.
పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఇంకా ఇంటా బయటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో కీలక విషయాలు బయటపెట్టారు ఎమ్మెల్సీ కవిత. ఇంతకీ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అన్న ప్రశ్నకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చేశారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని చెప్పారు. ఆ పార్టీ నాదని, ఈ విషయంలో తానెక్కడికి ఎక్కడికి పోతానని చెప్పారు.
పార్టీలో సమస్యలు ఉంటాయన్నారు. సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయని అన్నారు. వాటిపై పారదర్శకంగా చర్చ జరగాలన్నారు. సమస్య ఎవరివల్ల వస్తుందో తెలుసుకుని వాటిని సెట్రైట్ చేసుకోవాలన్నారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారామె. పార్టీ నిర్మాణంలో తన పాత్ర ఉందని కుండబద్దలు కొట్టేశారు. రేపు కూడా ఉంటుందని చెప్పకనే చెప్పింది.
ALSO READ: నాలుగేళ్ల వయసులో తప్పిపోయి 28 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే
తాను బీఆర్ఎస్‌లో ఉన్నానని క్లారిటీ ఇచ్చేశారు. కొన్ని ప్రశ్నలకు పార్టీ సమాధానం చెబుతుందన్నారు చెప్పకనే చెప్పేశారు కవిత. దీంతో ఆమె పార్టీ పెడుతుందన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. కవిత ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపై ప్రత్యర్థులకు అప్పుడే చెమటలు మొదలయ్యాయి.
ఏదో విధంగా ఆమెని బయటకు పంపాలని ఓ వర్గం చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె సమాధానాలకు వారికి నోటి వెంట మాట రాలేదు. దీంతో కొత్త స్కెచ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కవిత చెప్పే ప్రతీ విషయం డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. తగలాల్సివారికి తగులుతూనే ఉంటుందని ఆమె మద్దతుదారులు అంటున్నారు.