Oppo Reno 14 Pro 5G India| ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన ఒప్పో తన కొత్త మోడల్స్ అయిన రెనో 14 ప్రో 5G, రెనో 14 5G స్మార్ట్‌ఫోన్‌లను గురువారం భారత్‌లో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్‌లు పవర్ ఫుల్ ఫీచర్స్‌తో భారతీయులకు అందుబాటులో ఉన్నాయి. రెనో 14 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్, రెనో 14లో డైమెన్సిటీ 8350 చిప్ ఉన్నాయి. రెనో 14లో 6,000mAh బ్యాటరీ, ప్రో మోడల్‌లో 6,200mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రెండు ఫోన్‌లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 50MP మెయిన్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లు మే నెలలో చైనాలో విడుదలయ్యాయి.
భారత్‌లో ఒప్పో రెనో 14 సిరీస్ ధరలు
ఒప్పో రెనో 14 ప్రో 5G ధర 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో ప్రారంభ ధర రూ. 49,999గా ఉంది. అయితే 12GB + 512GB వేరియంట్ ధర రూ. 54,999 గా ఉంది. ఇది పెర్ల్ వైట్, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో రెనో 14 5G ధర 8GB + 256GB వేరియంట్‌తో రూ. 37,999 నుండి మొదలవుతుంది. 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 39,999, రూ. 42,999. ఇది ఫారెస్ట్ గ్రీన్, పెర్ల్ వైట్ రంగుల్లో లభిస్తుంది.
ఈ ఫోన్‌లు జూలై 8 నుండి ఒప్పో ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి.
ఒప్పో రెనో 14 ప్రో 5G ఫీచర్లు
ఒప్పో రెనో 14 ప్రో 5Gలో 6.83-అంగుళాల 1.5K LTPS OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఈ ఫోన్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌తో 12GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15.0.2లో రన్ అవుతుంది. మూడు AI ఫీచర్లను (AI అన్‌బ్లర్, AI రీకంపోజ్, AI కాల్ అసిస్టెంట్) సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయంలో, ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాలు 4K HDR వీడియో రికార్డింగ్‌ను 60fpsలో సపోర్ట్ చేస్తాయి. సూపర్ క్లారిటీ సెల్ఫీల కోసం కూడా 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో 6,200mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్, 50W ఎయిర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇది డ్యూయల్ నానో-సిమ్, eSIM, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇది IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. ఫోన్ బరువు 201g, టైటానియం గ్రే వేరియంట్ కొలతలు 163.35×76.98×7.48mm, పెర్ల్ వైట్ వేరియంట్ 7.58mm మందం ఉంటుంది.
Also Read: మీ వద్ద పాత ఐఫోన్‌లు ఉన్నాయా? ఈ మోడల్స్‌కు కోట్లలో రిసేల్ విలువ!
ఒప్పో రెనో 14 5G ఫీచర్లు
ఒప్పో రెనో 14 5Gలో 6.59-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌తో 6,000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌తో వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. దీని కెమెరా సెటప్ ప్రో మోడల్‌లాంటిదే, కానీ 50MP అల్ట్రావైడ్ కెమెరా బదులు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది.