BigTV English

Liquor prices: మందుబాబులకు తప్పని తిప్పలు.. మళ్లీ పెరగనున్న మద్యం ధరలు.. ఈసారి ఏకంగా..!

Liquor prices: మందుబాబులకు తప్పని తిప్పలు.. మళ్లీ పెరగనున్న మద్యం ధరలు.. ఈసారి ఏకంగా..!

Liquor prices: మందు బాబులకు తిప్పలు తప్పడం లేదు. ఇది వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


ఒక చీప్ లిక్కర్ తప్ప.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న మందు బాటిళ్లపై కనీసం 10 శాతం పెంచనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ప్ర‌తి లిక్క‌ర్ బాటిల్‌పై క‌నీసం రూ. 50 పెరిగే అవ‌కాశం ఉంది. ఎక్సైజ్ అధికారులతో, ఇతరు ముఖ్య అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే.. మద్యం​ ధరలను పెంచి ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..


దేని ప్రకారం.. ఏం విధానంగా.. మద్యం ధరలు పెంచనున్నారో చెప్పనున్నారు. ఎంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుందో కూడా ఆ నివేదికల్లో పేర్కొననున్నారు. అధికారులతో సమీక్షించిన తర్వాత మరింత లోతైన అధ్యయనం చేసి ధరలు పెంపుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మద్యం ధరలు పెంచడం ద్వారా ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నా రూ. 2000 కోట్లు అదనపు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే.  రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచింది. దీనివల్ల ఒక్కో బీరుపై సగటున రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పెరిగిన విషయం తెలిసిందే. ఈ ధరలకే మందు బాబులు తలలు బాదుకుంటున్నారు. తాజాగా లిక్కర్ బాటిళ్లపై కూడా మద్యం ధరలు సైతం పెరుగుతాయని వార్తలు వస్తుండటంతో మందుబాదులకు తిప్పడం తప్పడం లేదు.

Also Read: TGPSC Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టు షాకింగ్ న్యూస్.. నియామకాలకు బ్రేక్..

Also Read: ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో 558 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.78,800..

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×