Gangareddy Murder Case: జగిత్యాలకు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మారు గంగారెడ్డి హత్యకు పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు పక్కా స్కెచ్ తో దర్యాప్తు సాగిస్తున్నారు. ఇప్పటికే జగిత్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు ఇప్పటికే మోహరించారు. కాగా తాజాగా ఈ హత్యకు సంబంధించి ఓ సీసీ టీవీ వీడియో బయటకు రాగా.. అందులో ఓ వ్యక్తి పారిపోతున్నట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. అసలేం జరిగిందంటే..
జగిత్యాల జిల్లా జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య గావించబడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కత్తిపోట్లకి గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందగా, సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని, నిందితులను పట్టుకొనేంత వరకు కదిలేది లేదని బైఠాయించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి హత్యలు, అది కూడా తమ కాంగ్రెస్ నేత చనిపోవడం దారుణమన్నారు. జగిత్యాలలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని జీవన రెడ్డి ఆరోపించారు.
జాబితాపూర్‌లో కాంగ్రెస్ నేత హత్య.. వెనుక రాజకీయ కక్ష్యలే కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు కూడా రంగంలోకి దిగి, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, జీవన్ రెడ్డికి నచ్చజెప్పే పనిలో నిమగ్నమయ్యారు. పీసీసీ అద్యక్షుడు ఫోన్ చేసిన క్రమంలో ఇంతకు నేను కాంగ్రెస్ లో ఉన్నానా.. లేదా.. అసలు నేనెందుకు కాంగ్రెస్ లో ఉండాలంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నేత గంగారెడ్డిని చంపిన తర్వాత హంతకుడు వెళ్తున్న సీసీ కెమెరా దృశ్యాలు..@jeevanreddyMLC
#JeevanReddy #Congress #Murder #Bigtv https://t.co/e0J19yIlbW pic.twitter.com/TVd1hMhgua— BIG TV Breaking News (@bigtvtelugu) October 22, 2024
అయితే జీవన్ రెడ్డికి హత్యాగావించబడ్డ గంగారెడ్డి రైట్ హ్యాండ్ అని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా ఉండే గంగారెడ్డి మృతికి కారణమైన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ఎలాగైనా సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకొనేందుకు బృందాలుగా గాలింపు చేపట్టారు. ఈ కోణంలో పోలీసులు ఓ సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ కాగా, ఆ రికార్డ్ ను కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆ వీడియో ఉన్నది సంతోష్ అనే వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తుండగా, పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. వీడియోలో మాత్రం ఓ వ్యక్తి పారిపోతున్న దృశ్యాలు కనిపిస్తుండగా, హత్య చేసింది ఎవరో తేల్చే పనిలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంతకు గంగారెడ్డి హత్యకు ప్లాన్ ఎవరు చేశారు? చేసింది ఎవరనే విషయాలు పోలీసుల ప్రకటనతో నిర్ధారణ కావాల్సి ఉంది.
Also Read: Priyanka Singh : తీవ్ర విషాదంలో బిగ్ బాస్ ప్రియాంక సింగ్… పితృ వియోగం