Congress Leaders on Allu arjun: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. రేవతి అనే మహిళ మృతి.. శ్రీతేజ్ అనే బాలుడు మృత్యువుతో పోరాటం.. వీటన్నింటికి కారణం అల్లు అర్జునే.. అతను రావడం వల్లే ఇదంతా జరిగింది అంటూ శాసనసభ సాక్షిగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తన తప్పేం లేదని.. జరిగింది ఓ ప్రమాదం అంటున్నారు అల్లు అర్జున్. మరి ఇందులో ఎవరి మాట నిజం? ఎవరి మాట అబద్ధం?
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ తప్పు తెలుసుకోవడం లేదని.. ఇప్పటికీ తాను చేసింది కరెక్టే అనే తీరులో ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ధ్యాసంతా సినిమా కలెక్షన్స్ మీద తప్పా బాధిత కుటుంబం మీద కాదంటూ మండిపడ్డారు.
అల్లు అర్జున్ వ్యవహారం శైలి దారుణంగా ఉందని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్. అల్లు అర్జున్‌కు పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. రేవతి కుటుంబంపైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించడం లేదని సీరియస్ అయ్యారు ఆదిశ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టాలా అల్లు అర్జున్ తీరుందన్నారు. ఇద్దరు చనిపోయారన్నా అల్లూ అర్జున్ రోడ్ షో చేయడం కరెక్ట్ కాదని.. వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన వారిపట్ల ఎలాంటి సింపతి లేదని ఆగ్రహించారు ఆది శ్రీనివాస్.
Also Read: చట్టం దృష్టిలో అందరూ ఒకటే… అల్లు అర్జున్ కామెంట్స్ పై డీజీపీ రియాక్షన్..
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై హీరో అల్లు అర్జున్ పట్టన్నట్లు వ్యవహరించడం దారుణమని బిల్యా నాయక్ అన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన వారి గురించి మాట్లాడకుండా… తాను సినిమాకోసం కష్టించిన కష్టాన్ని గుర్తించడం సరైంది కాదన్నారు.
పుష్ప 2 ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రియాక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ ఎక్కువ మంది వస్తారని తెలిసినప్పుడు.. అలాంటి సమయంలో హీరో థియేటర్ దగ్గరికి వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలని అన్నారు. ఇప్పుడంతా ఆలోచించాల్సింది. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.