Rajagopal Reddy: రాజకీయాల్లో శాశ్వత మిత్రలు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఈ సామెత గురించి చాలామంది తలపండిన సీనియర్ నేతలు చెబుతారు. అందులో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ విపరీతంగా ఉంటుంది. ఎవరు.. ఎవరి మీదనైనా కామెంట్స్ చేసుకోవచ్చు. అప్‌కోర్స్.. అంతర్గత కలహాలు ఉంటాయనుకోండి అది వేరే విషయం. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు అడ్డుపడుతున్నారని మనసులోని ఆవేదన బయటపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పనక్కర్లేదు. అదొక సముద్రం లాంటింది వచ్చిన నాయకులు వస్తారు.. వెళ్లిపోతున్నవారు పోతారు. అధికారంలో ఉంటే ఒకలా ఉంటుంది. లేకుంటే మరొకలా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. గడిచిన ఆరు నెలలుగా రేవంత్ మంత్రివర్గం విస్తరణ ఉంటుందని రకరకాల ఊహాగానాలు లేకపోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ ఛీప్ మహేష్ కుమార్ హస్తినకు వెళ్లిన ప్రతీసారీ ఇదే ప్రచారం సాగుతుంది. హైకమాండ్ వద్ద తమ దగ్గరున్న పలుకుబడితో పైరవీలు చేస్తుంటారు.
మనసులో ఉన్నదంతా కక్కేశారు
మంత్రి పదవి వస్తుందని కొన్నాళ్లుగా ఆశపెట్టుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆయనకు ఎలాంటి విషయాలు తెలిశాయో గానీ మనసులోని ఉన్నదంతా బయటకు కక్కేశారు. ఆదివారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు రాజగోపాల్‌రెడ్డి. అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని, ఈ విషయంలో కొందరు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మూడు దశాబ్దాల పాటు మంత్రి పదవి అనుభవించారని, రంగారెడ్డి, హైదరాబాద్ నేతలకు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు.
ALSO READ: భూ భారతి చట్టం 14న జాతికి అంకితం
మంత్రి పదవి ఖాయమైనా కావాలనే జానారెడ్డి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. 25 ఏళ్లపాటు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నారని, అది సరిపోదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పుకొచ్చారు. అడుక్కుంటే మంత్రి పదవి వచ్చేది కాదన్నారు. తన వెంకట్‌రెడ్డి వల్లే తమ్ముడికి పదవి రాలేదన్న వ్యాఖ్యలపై నోరు విప్పారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటన్నది రాజగోపాల్ రెడ్డి మాట. తనకు మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలో కొందరు సీనియర్లకు చెమటలు పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఓ లేఖ రాశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకోవాలని ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఈసారి ప్రాధాన్యం అభిప్రాయపడ్డారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రస్తావించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మొత్తానికి మనసులోని ఉన్నదంతా కక్కేశారు సదరు ఎమ్మెల్యే.
మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదు.. కెపాసిటీ బట్టి వస్తుంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు
కేసీఆర్ను గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేసి చూపించా
– ఎమ్మెల్యే కోమటిరెడ్డి… pic.twitter.com/1WPwXYMkTM
— BIG TV Breaking News (@bigtvtelugu) April 13, 2025