E-Paper
Advertisement

లండన్‌కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్ ఎవరు?

లండన్‌కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంచార్జ్ ఎవరు?
Advertisement

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా 2025 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. ఇన్ ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నాక అనేక కీలక నిర్ణయాల్లో ఆమె పాత్ర ఉంది. డీసీసీల నియామకంలో పార్టీ పదవులు కావాలంటే 5 ఏళ్ల నిబంధన తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర, సర్ ప్రక్రియపై ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. ఐతే మీనాక్షి నటరాజన్ ఇటీవలే స్టడీ టూర్ కోసం లండన్ వెళ్ళారు. 10 నెలలు అక్కడే ఉంటారు. దీంతో ఆమె స్థానంలో అధిష్టానం కొత్త వారిని నియమిస్తుందనే చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఏంసి, పరిషత్ ఎన్నికలు రానున్నాయి. దీంతో రాష్ట్రంలో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్ళే చురుకైన ఇంఛార్జ్ మస్ట్ అంటున్నాయి పార్టీ వర్గాలు.

మీనాక్షి స్థానంలో సీనియర్ నేత?

Advertisement

మీనాక్షి స్థానం కోసం చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, మాణిక్‌రావు ఠాక్రే, జ్యోతిమణి సెన్నిమలై, చెల్లకుమార్, శక్తిసింహ్ గోహిల్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఓట్ బచావో – దేశ్ బచావో అంటూ సర్ పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంఛార్జ్ నియామకం ఇప్పట్లో లేదనే చర్చ కూడా వస్తోంది. మీనాక్షి నటరాజనే ఇంఛార్జ్ గా ఉంటారని కొందరంటున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆమెకు పూర్తి అవగాహన ఉందనే చర్చ ఉంది. ఈ 10 నెలలు జూమ్ ద్వారా సమావేశాలు నిర్వహిస్తారనీ… ఎప్పటికప్పుడు పీసీసీ చీఫ్, సిఏంతో ఆన్లైన్‌లో కాంటాక్ట్‌లో ఉంటూ పర్యవేక్షస్తారన్న మాట వినిపిస్తోంది. స్టడీ టూర్ తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటారని చెప్తున్నారు. ఐతే మీనాక్షి నటరాజన్ తిరిగి వచ్చే వరకు తాత్కాలిక ఇంఛార్జ్ ని అధిష్టానం రాష్ట్రానికి పంపిస్తుందనే చర్చ కూడా ఉంది.

Also Read: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Tags

Related News

మీ పిల్లలు డ్రగ్స్‌కు బానిసలయ్యారా.. భయపడకుండా ఇలా చేయండి?

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!

Big Stories

Advertisement
×