E-Paper
Advertisement

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. 22-ఎ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Advertisement

22-A Land: రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న 22-ఎ సమస్యల పరిష్కారానికి, భూ బాధితులకు ఊరటనిచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం మరో వేగవంతమైన ముందడుగు వేసింది. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

జి.ఓ 59 దరఖాస్తుదారులకు బిగ్ రిలీఫ్

Advertisement

జి.ఓ 59 పరిధిలోని 500 చదరపు గజాల లోపు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కేవలం నెల రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలతో కూడిన మెమో నెం. 48030ని జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలకు ఏమాత్రం తావులేకుండా, పూర్తిగా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా, గతంలో అక్రమంగా పొందిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా రీ-వెరిఫికేషన్ చేయనున్నట్లు చెప్పారు.

సీఎం హామీతో శరవేగంగా అడుగులు

Advertisement

ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ప్రైవేటు భూములు అనుకోకుండా 22-ఎ జాబితాలో చేరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధానంగా 10 నుండి 12 రకాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి జి.ఓ 118, జి.ఓ 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు జారీ చేశామన్నారు.

అనుమతులున్న ప్లాట్లు, నివాసాలకు ఊరట

22-ఎ జాబితాలో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP లేదా ఇతర మున్సిపల్ అనుమతులు పొందిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు సర్కార్ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి, నాలా ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల రిజిస్ట్రేషన్ చిక్కులకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.

 Also Read: సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

Tags

Related News

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. నీటికుంటలో పడి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!

కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు, అందుకే హెయిర్ ట్రాన్సప్లాన్‌టేషన్: బాల్మూర్ వెంకట్

తెలంగాణ వ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది’ సంబరాలు.. కేటీఆర్ కీలక పిలుపు!

SIR సర్వేపై BRS నోరు విప్పకపోవడానికి కారణం BJP భయమే! – మహేష్ కుమార్ గౌడ్

అసలే ఎల్ నినో.. రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృదా.. పట్టించుకోని అధికారులు!

అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు, ఈ ఘటనే ఎగ్జాంపుల్-సీపీ సజ్జనార్

సూర్యాపేటలో రిలే దీక్షలు.. బుల్లెట్ రైలు రూట్‌పై మిన్నంటిన నిరసనలు!

Big Stories

Advertisement
×