Telugu Movies In March 2025 : ఫిబ్రవరి ఎండింగ్ లోకి అడుగు పెట్టాం. ఈనెల చివర్లో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటా అనే ఆసక్తి పెరిగిపోయింది మూవీ లవర్స్ లో. ఇటీవల కాలంలో ఓటీటీలో ముందుగానే తమ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్టును ప్రకటిస్తున్నాయి. అలాగే చిత్ర నిర్మాతలు కూడా ముందుగానే తమ సినిమాల థియేట్రికల్ రిలీజ్ డేట్ ను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడైతే మూవీ మొదలు పెట్టగానే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల ముందుకు వస్తాయి. కానీ మరికొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. అలా మార్చ్ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
మార్చ్ మొదటి వారం సినిమాలు
మార్చి 7న నారి, రాక్షస, నీరుకుళ్లా , బ్రహ్మాండ, రక్ష, పౌరుషం, రారాజు, 14 డేస్ వంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఈ సినిమాలన్ని చిన్న సినిమాలే కాబట్టి వచ్చే నెల మొదటి వారం అంటే మార్చి 7న ప్రేక్షకు నిరాశ ఎదురు కావచ్చు. కానీ మార్చ్ 14న మాత్రం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.
రెండవ వారం ఆ 2 సినిమాలే…
మార్చి 14న నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘కోర్ట్’ (Court), మదం, ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దిల్రుబా’ (Dilruba), ల్యాంప్, ది హంటర్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ లిస్టులో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలు రెండే రెండు. అవి ‘కోర్ట్’, ‘దిల్రూబా’.
చివరి వారంలో మోస్ట్ అవైటింగ్ మూవీస్
ఇక మార్చ్ చివరి వారం పలు పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ లిస్టులో మార్చి 27న ఎల్ 2 : ఎంపురాన్ (L2: Empuraan), డార్క్ నైట్, వీర ధీర సురాన్ పార్ట్ 2 రిలీజ్ కానున్నాయి. ఇక ఇప్పటిదాకా రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసిన ప్రకారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటింగ్ సినిమాలు 3 ఉన్నాయి. మార్చ్ 28న హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu), రాబిన్ హుడ్ (Robin Hood), మ్యాడ్ 2 (Mad 2) థియేటర్లలోకి రాబోతున్నాయి.
‘హరిహర వీరమల్లు’ వాయిదా తప్పదా?
గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ పోన్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘రాబిన్ హుడ్’ మూవీని మార్చి 28న రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్మెంట్ రావడంతో దాదాపు ఈ విషయం కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. ఆ నెక్స్ట్ డేనే ‘మ్యాడ్ 2’ రిలీజ్ పెట్టుకోవడంతో ‘హరిహర వీరమల్లు’ మూవీ వాయిదా తప్పనిసరి అని ప్రచారం జరుగుతుంది. దీంతో హరిహర వీరమల్లు, రాబిన్ హుడ్, మ్యాడ్ 2 సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో టాలీవుడ్ మూవీ లవర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు.