E-Paper
Advertisement

సర్వేలో టాప్ రికార్డ్.. ఫస్ట్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

సర్వేలో టాప్ రికార్డ్.. ఫస్ట్ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!
Advertisement

Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర మంత్రిమండలి పనితీరుపై ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ మంత్రుల పనితీరుకు సంబంధించి ప్రకటించిన లేటెస్ట్ గ్రేడింగ్‌లో ఆయన అందరికంటే ముందంజంలో నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిషన్ రెడ్డి కనబరిచిన అద్భుతమైన పనితీరును ప్రధాని మోడీ ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ దేశ రాజధానిలో నంబర్ వన్ మినిస్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవడంపై అటు రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ, ఇటు సొంత నియోజకవర్గ ప్రజల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అత్యుత్తమ రేటింగ్‌తో..

కేంద్ర ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజల్లోకి పథకాలను తీసుకెళ్లడం, ఫైళ్ల క్లియరెన్స్, వినూత్న నిర్ణయాల అమలు వంటి పలు కీలక అంశాల ఆధారంగా ఈ గ్రేడింగ్ ఇచ్చారు. ఇందులో కిషన్ రెడ్డి అత్యుత్తమ రేటింగ్‌తో టాప్ పొజీషన్ సాధించారు. గతంలో ఆయన పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్నప్పుడు కూడా వంద శాతం నిధుల వినియోగంతో రికార్డు సృష్టించారు. ఇప్పుడు బొగ్గు, గనుల శాఖల్లోనూ అదే జోరును కొనసాగిస్తూ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. మంత్రిమండలి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కిషన్ రెడ్డి పనితీరును ప్రస్తావించారు. బాధ్యత ఏదైనా.. నిబద్ధతతో పనిచేయడం కిషన్ రెడ్డి శైలి అంటూ ప్రధాని మోడీ కితాబిచ్చినట్లు చెబుతున్నారు. శాఖల నిర్వహణలో ఆయన చూపిస్తున్న చొరవ, అవినీతి రహిత పాలన, క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించడమే ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయని ప్రధాని ప్రశంసించారు.

Advertisement

Also read: పార్టీ మారినోళ్లకు పీటలు.. మాకు అవమానాలా? బీఆర్ఎస్ ఇన్‌ఛార్జులను నిలదీసిన ఉద్యమకారులు

కిషన్ రెడ్డికి పెరిక సురేశ్ అభినందనలు

కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి నంబర్​ వన్​ ర్యాంక్​ సాధించడంపై బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్​ మీడియా నేషనల్​ మెంబర్​ పెరిక సురేష్​ హర్షం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కిషన్ రెడ్డిని పెరిక సురేష్​.., మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్​ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రుల పనితీరు అంచనాల్లో కిషన్ రెడ్డి గ్రేడింగ్​లో నంబర్-వన్​ స్థానం సాధించడం ఆయన పరిపాలనా నైపుణ్యం, అభివృద్ధిపై అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప సాధనలో కిషన్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారని నాయకులు కొనియాడారు. తెలంగాణ గర్వించదగ్గ నాయకుడిగా, బీజేపీకి అంకితభావంతో సేవలందిస్తున్న నేతగా కిషన్ రెడ్డి పేరు దేశవ్యాప్తంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

గ్రేడింగ్‌కు ప్రామాణికంగా నిలిచిన అంశాలివే..

Advertisement

బొగ్గు, గనుల వేలంలో పారదర్శకత.
సమర్థవంతమైన నిర్ణయాలు.
కేటాయించిన బడ్జెట్‌ను సకాలంలో ఖర్చు చేయడంతో పాటు ఆ పనులకు వంద శాతం నిధులను వినియోగించడం.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి చేర్చడం.
సమయపాలన, నిబద్ధతతో శాఖాపరమైన ఫైళ్లను వేగంగా పరిష్కరించడం.

Also Read: గండిపేట భూ కబ్జా కేసులో సంచలనం.. జీవోల కోసం 4కోట్లు..!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×