E-Paper
Advertisement

కోట్ల విలువైన మత్తు… ఒక్క క్షణంలో బూడిద! సైబరాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్

కోట్ల విలువైన మత్తు… ఒక్క క్షణంలో బూడిద! సైబరాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్
Advertisement

Drugs Destroyed: హైదరాబాద్‌లో యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తూ, సమాజానికి పీడకలలా మారిన మాదకద్రవ్యాలపై సైబరాబాద్ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. వివిధ కేసుల్లో పట్టుబడిన భారీ మొత్తంలో డ్రగ్స్‌ను శనివారం అధికారులు బహిరంగంగా ధ్వంసం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించిన సుమారు 833 కిలోల మాదకద్రవ్యాలను పోలీసులు పూర్తిగా నిర్వీర్యం చేశారు. మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.5.02 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ డిస్పోజల్..
డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మన్, డీసీపీ ముత్యం రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఎదులాపల్లి పరిసర ప్రాంతంలోని ఒక బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌లో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, నిబంధనలకు లోబడి ఈ డ్రగ్స్ మొత్తాన్ని తగలబెట్టారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకత కోసం అధికారులు పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు.

Advertisement

గంజాయి నుంచి ఎండీఎంఏ వరకు..:
ధ్వంసం చేసిన ఈ మాదకద్రవ్యాలలో అత్యధిక భాగం గంజాయే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు రూ.3.98 కోట్ల విలువైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయితో పాటు, యువతను ఆకర్షించడానికి చాక్లెట్ల రూపంలో మార్చిన గంజాయి చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకుని నాశనం చేశారు. వీటితో పాటు ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ అయిన ఎండీఎంఏ (MDMA), హష్ ఆయిల్, ఆల్ఫ్రాజోలమ్ పౌడర్, మరియు చరస్ వంటి ప్రమాదకర రసాయన మత్తుపదార్థాలు కూడా ఇందులో ఉన్నాయి.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సైబరాబాద్ పోలీసులు నిరంతరం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేవలం డ్రగ్స్ పట్టుకోవడమే కాకుండా, వాటి మూలాలను వెతికి పట్టుకుని స్మగ్లర్ల నెట్‌వర్క్‌ను ధ్వంసం చేస్తున్నామని డీసీపీ ముత్యంరెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాల విక్రయదారులపై కఠినమైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, సమాజంలో ఎవరైనా డ్రగ్స్ సరఫరాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని ఈ చర్య ద్వారా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Also Read: తెలంగాణలో లేని అందాలు ఏపీలో ఉన్నాయి.. సినీ పరిశ్రమకు మంత్రి దుర్గేశ్ బంపర్ ఆఫర్!

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×