BigTV English

Congress: బీజేపీలోకి దామోదర!?.. అందుకేనా కోవర్టు ఆరోపణలు?

Congress: బీజేపీలోకి దామోదర!?.. అందుకేనా కోవర్టు ఆరోపణలు?

Congress: కోవర్టిజం అంటూ కాంగ్రెస్(Congress)లో కాక రేపారు దామోదర రాజనర్సింహ. కమిటీల్లో అనర్హులకు చోటు.. కొత్తగా వచ్చిన వారికి పదవులు… బీసీ దళిత మైనార్టీలకు గుర్తింపు లేదు.. ఇలా పలు ఆరోపణలు చేశారు. ఇప్పటికే కొండా సురేఖ, బెల్లయ్య నాయక్, విష్ణు, గీతారెడ్డి, వీహెచ్, భట్టి.. తదితర సీనియర్లు రేవంత్ రెడ్డిపై రెబెల్ జెండా ఎగరేయగా.. లేటెస్ట్ గా దామోదర.. మరింత మంట రాజేశారు. ఇంతకీ ఆయన ఆరోపించినట్టు కాంగ్రెస్(Congress)లో కోవర్టులు ఉన్నారా? ఉంటే ఎవరు? ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే ఆ విషయం బయటకు చెప్పడం వెనుక ఆంతర్యమేంటి? ఇలా అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


దామోదర రాజనర్సింహ విషయమే తీసుకుంటే.. ఆయన పేరు విని ఎన్నాళ్లైంది? ఇన్నాళ్లు ఎక్కడున్నారాయన? అని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు. మునుగోడుకు వచ్చారా? పార్టీ మీటింగులకు హాజరయ్యారా? ప్రజల్లో తిరిగారా? నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారా? సడెన్ గా ఇప్పుడు మీడియా ముందుకొచ్చి.. ఓపెన్ గా కోవర్టులు అంటూ కలకలం రేపడం ఏంటి? అంటున్నారు. ఇదంతా పక్కా ప్లాన్డ్ గా జరుగుతున్న వ్వవహారంగా అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. మునుగోడులో అతికష్టం మీద గెలిచింది. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీజేపీ మాత్రం దూకుడు మీదుంది. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్(Congress) ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ కు కోవర్టులుగా ఉండే అవకాశం ఉందా? ఇప్పటికే పోయేవారంతా పోయారు. కారు పార్టీ ఫుల్లీ లోడెడ్. నేతలు దండిగా ఉన్నారు. ఇక వలసలకు ఏమాత్రం ఛాన్స్ లేదు. మరి, కాంగ్రెస్(Congress) నాయకులు కేసీఆర్కు ఎందుకు కోవర్టులుగా ఉంటారు? కావాలనే దామోదర ఇలా బురద జల్లుతున్నారా? ఇంతకీ ఆయన సంగతి ఏంటి?


ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరుగుతున్న సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజులు.. పెద్ద స్కెచ్చే వేశారని తేలింది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా.. కాంగ్రెస్(Congress) నేతలపైనా కన్నేసినట్టు సిట్ తెలిపింది.

కాంగ్రెస్(Congress) సీనియర్ నేత దామోదర రాజనర్సింహాను ఆ ముగ్గురు సంప్రదించారట. హైదరాబాద్ లోని స్కై హై హోటల్ లో వాళ్లంతా కలిశారట. సింహయాజులు ఆ ఆపరేషన్ ను లీడ్ చేసినట్టు సిట్ తెలిపింది. దామోదర రాజనర్సింహను బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది. ఆయన గురించి బీజేపీ పెద్దలకు ఘనంగా చెప్పారట సోమయాజులు అండ్ కో. దళిత, రెడ్డి సామాజికవర్గాల్లో రాజనర్సింహకు బలమైన మద్దతుందని.. 20 నియోజకవర్గాల్లో 75 వేల చొప్పున ఓటు బ్యాంకుందని.. ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి అతడి దగ్గర సమాచారముందని.. ఇలా రాజనర్సింహను ఎలాగైనా బీజేపీలోకి లాగేయాలని గట్టి ప్రయత్నమే జరిగిందని సిట్ తేల్చింది.

కొంతకాలంగా రాజనర్సింహ కాంగ్రెస్(Congress)లో యాక్టివ్ గా లేరు. గతంలో ఆయన భార్య పద్మినిరెడ్డి.. బీజేపీలో చేరడం ఆయనకు షాక్ ఇచ్చింది. ఆ సమయంలోనే రాజనర్సింహపై విమర్శలు వచ్చాయి. అలాంటి దామోదర.. ఇప్పుడు కోవర్టులు, పదవులు, ప్రాధాన్యం అంటూ పబ్లిక్ గా రచ్చ చేయడం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందని అనుమానిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు దామోదర రంగం సిద్ధం చేసుకున్నారని.. పార్టీ వీడేలోపు కాంగ్రెస్(Congress)కు మాగ్జిమమ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఓ వర్గం ఆరోపణ. ఇందులో నిజానిజాలు ఎలాఉన్నా.. దామోదర వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్(Congress)లో కల్లోలం రేపుతున్నాయి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×