Lady Aghori: అఘోరీ మాత రాకకు కారణం ఏంటి? అసలు ఆమె ప్లాన్ ఎలా ఉండబోతోంది? కార్తీకమాసం తర్వాత తెలంగాణకు అఘోరాలు పెద్ద ఎత్తున రానున్నారా.. అసలు అఘోరీ మాత ఏం చేయబోతున్నారు? కుంభమేళాలో అఘోరాలతో చర్చలు నిజమేనా? ఇలా ఇన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. కారణం అఘోరీ మాత తాజాగా చేసిన కామెంట్స్ చూస్తే, కార్తీక మాసం తర్వాత పెద్ద ప్లాన్ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు అఘోరీ మనసులో ఏముంది?
తెలంగాణకు చెందిన అఘోరీ మాత అంటే తెలియని వారు అసలు ఉండరు కూడా. కారణం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. పోలీసులు అడ్డుకుంటే ఆత్మార్పణ అనడం, పెట్రోల్ క్యాన్ బయటకు తీయాల్సిందే. ఏపీ పర్యటనలో శ్రీకాళహస్తి వద్ద అన్నంత పని కూడా చేసి, చివరకు పోలీసుల చొరవతో వెనక్కు తగ్గారు. నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తున్నారు కాబట్టే, ఈమెకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడా ఉందనే చెప్పవచ్చు.
మొన్నటి వరకు ఆలయాల దర్శనం లక్ష్యంగా సాగిన అఘోరీ మాత, ఉన్నట్లుండి తన పంథా మార్చారు. ప్రజలకు సేవలు చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంస్థల కార్యాలయాలను అఘోరీ సందర్శిస్తున్నారు. అందులో భాగంగానే దిల్ సుఖ్ నగర్ లో పర్యటించి, సేవారంగంలో రాణించే వారికి తాను అండగా ఉంటానంటూ ప్రకటించారు. ఇక్కడే పలు కీలక వ్యాఖ్యలు చేశారు అఘోరీ.
కార్తీకమాసం పూర్తవగానే తన ప్లాన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆమె. త్వరలో జరగబోయే కుంభమేళా లో అఘోరాల మీటింగ్ జరగబోతోందని, ఆ మీటింగ్ లో ఆలయాల కూల్చివేతలకు పాల్పడిన వారిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాదు తెలంగాణకు కార్తీకమాసం తర్వాత భారీగా అఘోరాలు రానున్నట్లు, తన గురువు ఆదేశాల మేరకు తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు. నా తాండవం ఏమిటో అప్పుడు చూపిస్తా.. ఇప్పుడు కాదు అంటూ ప్రకటించారు.
హిందువులు ఏకం కావడం లేదంటూనే, ఆలయాలపై దాడులు నియంత్రించక పోతే, ఆత్మార్పణ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నట్లు మరోమారు ప్రకటించారు. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, ఆలయాలపై దాడులు అపడంలో ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించడం లేదని, కార్తీకమాసం పూర్తయిన తరువాత తన కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.
ఈ కామెంట్స్ చూస్తే కార్తీకమాసం తర్వాత అసలు తాండవం చేస్తానన్న అఘోరీ మాత మాటల్లో అంతరార్థం ఏముంది? అఘోరాలు ఒక్కసారిగా రావడం వెనుక ఆంతర్యం ఏమిటి? అఘోరాల మీటింగ్ లో ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ ఈ ప్రశ్నలు మాత్రం ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. మరోవైపు అఘోరీ వెనుక రహస్య వ్యక్తి ఉన్నట్లు ప్రచారం సాగినా, అఘోరీ మాత్రం తనకు కావాల్సింది ఆలయాల రక్షణ, మహిళల భద్రత ఇదేనంటూ ప్రకటిస్తున్నారు. మొత్తం మీద కార్తీకమాసం పూర్తవగానే అఘోరీ ప్లాన్ ఏంటనేదే జోరుగా చర్చ సాగుతోంది. మరి అప్పటి వరకు మనం కూడా వెయిట్ అండ్ సీ!
దిల్సుఖ్నగర్లో అఘోరి హల్చల్…
చైతన్యపురిలోని మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి వచ్చిన అఘోరి.
ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చానని వెల్లడి.
ఒక వ్యక్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానన్న అఘోరి.… pic.twitter.com/LtOqZzujL3— ChotaNews (@ChotaNewsTelugu) November 14, 2024