E-Paper
Advertisement

MLA Balu Naik: బీజేపీ కన్ను మన ఓట్లపై.. అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే బాలు నాయక్

MLA Balu Naik: బీజేపీ కన్ను మన ఓట్లపై.. అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే బాలు నాయక్
Advertisement

MLA Balu Naik: స్వేచ్చ బ్యూరో: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) ప్రక్రియపై పూర్తి అవగాహనతో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని ఇందుకు బీఎల్ వోలతో కలిసి సర్ విధానం పరిశీలించాలని నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బూత్ లెవెల్ ఏజెంట్లకు సూచించారు. మంగళవారం సర్ విధానంపై దేవరకొండ నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ ఎమ్మెల్సీ, నల్గొండ పార్లమెంట్ సర్ ఇంచార్జ్ బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

నియోజకవర్గ వ్యాప్తంగా..

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను కేంద్ర ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా బూత్ లెవెల్ ఏజెంట్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూత్ లెవెల్ అధికారితో కలిసి మన ఓట్లు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెందే అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 326 బూత్‌లు ఉండగా ప్రతి పది బూత్‌లకు ఒక ఇన్చార్జిగా ఉంటారు చెప్పారు.

Advertisement

Also read: ఫ్రిజ్ కొంటున్నారా? సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇన్వర్టర్ టెక్నాలజీలలో ఏది బెస్ట్?

బూత్ స్థాయిలో..

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా బూత్ లెవెల్ ఏజెంట్లు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల ప్రజలు ఓటర్ల జాబితాలో నమోదు కావడానికి సహకరించాలని సూచించారు. బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ అసెంబ్లీ ఇంచార్జ్ ప్రతాప్ రెడ్డి రాష్ట్ర వడ్డెర సంఘం చైర్మన్ గుంజ రేణుక నారాయణ తదితరులున్నారు.

Advertisement

Also read: Boora Criticism: ఎన్నికల ముందు బట్లర్.. పవర్ రాగానే హిట్లర్.. రేవంత్ రెడ్డి పరిపాలనపై బూర సంచలన వ్యాఖ్యలు!

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×