
Latest gas cylinder price(Today news paper telugu):
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ రేట్ కూడా పెరగటమే కానీ తగ్గటమే లేదు. గడిచిన ఐదేళ్లలో దాదాపు డబుల్ అయింది గ్యాస్ ధర. రాయితీని పూర్తిగా ఎత్తేశారు. అందుకే, రేట్లు భగ్గు మనటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు ఉన్నాయి. అయితే, తమ చేతిలో ఏమీ లేదని.. అంతా అంతర్జాతీయ మార్కెట్ ప్రకారమే ధరలు పెరిగాయని కేంద్రం చెబుతుండేది. అక్కడ పెరగకున్నా.. ఇక్కడ పెంచుతున్నారంటూ ఎప్పటికప్పుడు రాజకీయ రచ్చ జరుగుతుండేది.
చాలాకాలం తర్వాత సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.200 చొప్పున ధర తగ్గించింది. ఈ రాయితీ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ఆమోదించారు. ఇక, ఉజ్వల పథకం సిలిండర్లపై ఏకంగా రూ.400 తగ్గించింది.
తాజా నిర్ణయం వల్ల 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది.