Gachibowli: హైదరాబాద్‌లో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ గేటు-2కు ఎదురుగా ఉన్న హాస్టల్‌లో ఉంటోంది 28 ఏళ్ల యువతి. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఏఐ వచ్చిన తర్వాత స్టాప్‌వేర్ ఇంజనీర్లలో భయం పట్టుకుంది. తమ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతోంది. ఈ క్రమంలో చాలామంది ఒత్తిడి గురవుతున్నారు. ఫలితంగా ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. ఈ తరహా రోజుకు ఒక్కరు లేదా ఇద్దరు టెక్కీలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు దేశవ్యాప్తంగా కనిపిస్తోంది.
తాజాగా హైదరాబాద్ సిటీలోని ఐటీ కారిడార్ ప్రాంతం గచ్చిబౌలిలో ఓ మహిళా టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమె వయస్సు 28 ఏళ్లు, ఆమె పేరు మనీషా. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన మనీషా. నానక్‌రామ్ గూడలోని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. డిప్రెషన్, ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో వెల్లడైంది. ఘటనాస్థలంలో తండ్రికి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే మనీషా కుటుంబ సభ్యులకు గచ్చిబౌలి పోలీసులు సమాచారం ఇచ్చారు. మనీషా హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. లేఖలో తండ్రి గురించి ప్రస్తావించింది. తండ్రి దూరంగా ఉంచలేకపోవడం, ఫ్రెండ్స్ ఎవరూ సరిగా మాట్లాడలేదని అందులో ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ లో ఆమె ఒక్కరే ఉన్నట్లు చెబుతున్నారు. తన పర్సనల్ విషయాలు కూడా అదే ప్రస్తావించిందినట్టు తెలుస్తోంది. ఆ విషయాలను పోలీసులు బయట పెట్టలేదు.
ALSO READ: తెలంగాణ పశుపోషకులకు బిగ్ షాక్.. 12 ఏళ్లయినా తప్పని తిప్పలు!
సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. హాస్టల్ ఫ్రెండ్ గది తలుపు తీయడానికి చాలా సేపు ప్రయత్నం చేశారు. వెంటనే హాస్టల్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే పోలీసులకు తెలిపారు. వారు వచ్చి తలుపు బద్దలు కొట్టి చూసేసరికి ఆత్మహత్య చేసుకుంది మనీషా. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో.