BigTV English

BRS : ఇంకా అవే మాటలా ఎర్రబెల్లి? మీరిక మారరా?

BRS : ఇంకా అవే మాటలా ఎర్రబెల్లి? మీరిక మారరా?

BRS : ఎర్రబెల్లి దయాకర్‌రావు. తెలంగాణలో సీనియర్ మోస్ట్ లీడర్. టీడీపీలో ఉన్నప్పుడు నెంబర్ 2 గా ఉండేవారు. బీఆర్ఎస్‌లోకి వచ్చాక మంత్రి అయ్యారు. రాజకీయాల్లో ఓటమి ఎరుగని ఈ లీడర్.. 26 ఏళ్ల యశస్వినిరెడ్డి చేతిలో ఓడిపోవడంతో పరువంతా పోయింనంత పనైంది. అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఏప్రిల్ 27న వరంగల్‌లో బీఆర్ఎస్ రజితోత్సవ సభ ఉండటంతో మళ్లీ హడావుడి చేస్తున్నారు. మీటింగ్ పనులు పర్యవేక్షిస్తూనే.. రాజకీయ విమర్శలు కూడా స్టార్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసురుతున్నారు.


రేసులో 32 మంది.. ఎర్రబెల్లి కామెడీ?

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలీదంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారని.. వారిలో ఎవరికి ఇచ్చినా.. మిగతా వారు బయటకు వస్తారంటూ జోస్యం చెప్పారు. అందుకే మంత్రి పదవులు ఇవ్వట్లేదని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని.. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటూ సర్కారును ఛాలెంజ్ చేశారు ఎర్రబెల్లి. అప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం తెలుస్తుందని అన్నారు.


ఎవరి మెప్పు కోసం ఈ మాటలు?

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. గతంలో ఇలానే ప్రభుత్వం పడిపోతుంది అంటేనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేశారు. అయినా బీఆర్ఎస్ తీరు మారినట్టు లేదని.. ఎర్రబెల్లి మళ్లీ అలానే ప్రభుత్వం పడిపోతుందంటూ రెచ్చగొడుతున్నారని హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. ముందు మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండంటూ హితవు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క పిలుపు ఇస్తే బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ మెప్పు పొందేందుకే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా ప్రభుత్వం పడిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అయినా.. కేబినెట్ రేసులు 32 మంది ఎమ్మెల్యేలు ఉండటం ఏంటి.. కామెడీ కాకపోతే ? ఈ ఒక్క డైలాగ్‌ను బట్టి చెప్పొచ్చు ఎర్రబెల్లి కావాలనే బట్టకాల్చి మీద వేస్తున్నారని. కల్లబొల్లి మాటలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని. కేబినెట్ విస్తరణ అనేది కాంగ్రెస్ అంతర్గత విషయం. కంప్లీట్‌గా హైకమాండ్ డెసిషన్. మధ్యలో దయాకర్‌రావుకు ఏం ఇంట్రెస్ట్? ఏదో అనాలని కాకపోతే.. కేబినెట్ విస్తరిస్తే ప్రభుత్వం పడిపోవడం ఏంటి? ఇలా అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎర్రబెల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు హస్తం నేతలు.

Also Read : లేడీ అఘోరీతో శ్రీవర్షిణి పెళ్లి.. సెక్స్ కోసం…

పంతం పట్టి.. ఎర్రబెల్లిని ఓడించి..

ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డిల వైరం ఈనాటిది కాదు. టీడీపీలో ఉన్నప్పటి నుంచీ రేవంత్‌ దూకుడుకు.. ఎర్రబెల్లి తరుచూ మోకాళ్లు అడ్డుపెట్టే వారని అంటారు. టీడీపీలో ఉంటూ దయాకర్‌రావు పొడిచిన వెన్నుపోటు వల్ల రేవంత్ అనేక ఇబ్బందులు పడ్డారని చెబుతారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ లీడర్ అయ్యాక.. ఎర్రబెల్లిని ఎలాగైనా ఓడించాలనే పంతం పట్టారు. యశస్వినిరెడ్డిని బరిలో దింపి.. ఆమెకు అన్నివిధాలా అండాదండగా నిలిచి.. దయాకర్‌రావుకు బై బై చెప్పేశారు. పాలకుర్తిలో మరోసారి పోటీ చేయాలంటేనే ఆలోచించేలా చేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×