E-Paper
Advertisement

EX DSP Nalini: “ఉద్యోగం చేయలేను.. సీఎంకు ధన్యవాదాలు”

EX DSP Nalini: “ఉద్యోగం చేయలేను.. సీఎంకు ధన్యవాదాలు”
Advertisement

DSP Nalini: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయత పట్ల మాజీ డీఎస్పీ నళిని ధన్యవాదాలు తెలియచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన నళినికి డీఎస్పీ లేదా అదే క్యాడర్ లో సమానమైన మరో ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి అభిమానానికి స్పందిస్తూ ఉద్యోగం చేయలేనంటూ లేఖ ద్వారా నళిని చెప్పారు. జీవితంలో అష్టకష్టాలు ఎదుర్కొని చివరికి బ్రాహ్మణిగా మారానని వెల్లడించారు. ప్రస్తుతం సనాతన ధర్మం పాటిస్తున్నందున మరో మార్గం వైపు మరలే ఆలోచన లేదన్నారు. వేద ప్రచారకురాలిగా వైదిక ధర్మాన్ని ప్రచారం చేయడమే తన కర్తవ్యం అని చెప్పారు. అయితే తొందర్లోనే ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు.

ఇటీవల పోలీసు శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు సంక్షేమం గురించి మాట్లాడుతూ.. డీఎస్పీ నళిని గురించి వివరాలు అడిగారు. రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవి త్యాగం చేసిన నళిని గురించి సమాచారం కోరారు. నళినికి పోలీసు శాఖలోనే డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ పోలీసు నియామవళి ప్రకారం కుదరకపోతే.. డీఎస్పీ హోదాకు సమానమైన ర్యాంక్ లో ఇతర శాఖలో ఉద్యోగమివ్వాలని చెప్పారు. అందుకనుగుణంగా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisement

.

.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×