E-Paper
Advertisement

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు

ఎక్స్‌సెలెన్షియా విద్యార్థుల విజయ కేతనం.. టాపర్లుగా నిలిచినవిద్యార్థులు
Advertisement

Student Success: స్వేచ్ఛ బ్యూరో: టాప్ ర్యాంకులు సాధించడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి తన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడమే అసలైన విద్యా లక్ష్యమని ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది కూడా విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల కృషితో రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీరజా తెలిపారు. శుక్రవారం శామీర్పేట్ లో ఎక్స్‌సెలెన్షియా విద్యాసంస్థలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఉపయోగపడే నైపుణ్యాలు..

ఈ సందర్భంగా నీరజా మాట్లాడుతూ దేశ నిర్మాణం అంటే కొద్దిమంది టాపర్లతో కాదు, ప్రతి బిడ్డలోని ప్రతిభను వెలికితీయడం ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు. మార్కులు, ర్యాంకులకు మాత్రమే పరిమితం కాకుండా, జీవితాంతం ఉపయోగపడే నైపుణ్యాలు, విలువలను విద్యార్థులకు అందించడంపై దృష్టి సారిస్తున్నామని ఆమె తెలిపారు.కఠినమైన అకడమిక్స్‌తో పాటు విద్యార్థుల మానసిక, వ్యక్తిత్వ వికాసానికీ ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె చెప్పారు. గతంలో 6-7వ తరగతుల నుంచి చదివిన విద్యార్థులు ఐఐటీ కాన్పూర్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు సాధించడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫలితాలు కూడా సరైన మార్గదర్శనం ఉంటే ప్రతి విద్యార్థి రాణించగలడని మరోసారి రుజువు చేశాయని తెలిపారు.

Advertisement

Also Read: ఇరాన్ ఆయిల్ ప్లాంట్లపై బాంబుల వర్షం.. ఇంధన ధరలు తగ్గడం అనేది ఇక బ్రమేనా..!

ఈ విజయానికి కారణం

సాయి కృష్ణ – 98%, బాసపోగు ప్రహర్షిత్ – 97.2% సిరిపురం సంజయ్ ఆర్యన్ – 97% పాఠశాల టాపర్లుగా నిలిచారని చెప్పారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల విశ్వాసమే ఈ విజయానికి కారణమని నీరజా తెలిపారు. ప్రతి విద్యార్థి పురోగతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్‌సెలెన్షియా స్కూల్స్ & కాలేజ్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్. ఈశ్వరన్, ప్రిన్సిపాల్ ఇన్ఫినిటమ్ నీర్జా, ప్రిన్సిపాల్ ఎక్స్‌సెలెన్షియా ఆనందిని అనీషా ఎల్ దాస్, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ జంషేద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: తమిళనాడులో ఘోరం.. లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి!

Related News

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

Big Stories

Advertisement
×