E-Paper
Advertisement

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!

Excise Constable Soumya: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి సాయం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం!
Advertisement

Excise Constable Soumya: నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల కారు దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆమె తెగువను ప్రభుత్వం గుర్తించింది. ఆదివారం సౌమ్య మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వం తరపున కీలక ప్రకటనలు చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. 1 కోటి ఆర్థిక సాయం (ఎక్స్‌గ్రేషియా) అందజేస్తుందని తెలిపారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆమెపై ఆధారపడిన కుటుంబం ఇబ్బంది పడకుండా, సౌమ్య రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు ఆమెకు అందాల్సిన పూర్తి జీతభత్యాను కూడా కుటుంబానికి చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

జనవరి 23న నిజామాబాద్ శివారులోని మాధవనగర్ వద్ద గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ బృందం తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో నిందితులు తమ కారుతో సౌమ్యను ఢీకొట్టి ఆమెపై నుండి దూసుకెళ్లారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

సౌమ్య మరణం ఎక్సైజ్ శాఖలో భద్రతా పరమైన మార్పులకు నాంది పలికింది. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులకు కూడా ఆయుధాలు (తుపాకులు) అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి వెల్లడించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

Advertisement

Read Also: Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ ఫుల్ ఫోకస్!

Related News

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

Big Stories

Advertisement
×