BigTV English

Tonique liquor mart: హైదరాబాద్.. టానిక్ లిక్కర్ మార్ట్‌కు షాక్.. కాకపోతే..

Tonique liquor mart: హైదరాబాద్.. టానిక్ లిక్కర్ మార్ట్‌కు షాక్.. కాకపోతే..

Tonique liquor mart: ఎట్టకేలకు హైదరాబాద్‌లో వివాదాస్పద ‘టానిక్’ లిక్కర్ మార్క్ క్లోజ్ అయ్యింది. ఇందులో మద్యం విక్రయాలకు దాదాపు తెరపడింది. అందులోవున్న మద్యాన్ని డిపోకు తరలించారు అధికారులు. అసలేం జరిగిందంటే..


తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులు ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్.. టానిక్ మార్ట్‌కు ప్రత్యేకంగా మినహాయింపులు ఇచ్చింది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకు భారీగా గండిపడింది. దీన్ని గమనించిన అధికారులు, తిరిగి రెన్యువల్ అనుమతులను తిరస్కరించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 36లోని లిక్కర్ మార్ట్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది టానిక్ షాపు. ఇందులో బ్రాండ్స్‌కు కొదవలేదు. అయితే ఈ షాపుకు లైసెన్స్ ఆగష్టు 31తో ముగిసింది. రెండు రోజుల కిందట అమ్మకాలకు గడువు ముగిసింది. దీంతో ఆబ్కారీ శాఖ అధికారులు ఆదివారం దుకాణాన్ని మూసివేశారు.


ALSO READ:  ప్రాజెక్టుల్లో జలకళ.. వరద నీరు రిజర్వాయర్లకు తరలించాలి

2016లో టానిక్ మార్ట్ షాపు జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు అయ్యింది. దీనికి ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. అంటే ఏడాదికి ఒకసారి మాత్రమే రెన్యువల్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే మద్యం పాలసీ ప్రకారం రెండేళ్లకు ఒకసారి షాపు రెన్యువల్ చేయించుకోవాల్సివుంటుంది. ఆగస్టు 31తో లైసెన్స్ గడువు ముగిసింది.

రెండు నెలల కిందట రెన్యువల్ కోసం షాపు యజమానులు దరఖాస్తు చేశారు. దీన్ని ఎక్సైజ్ అధికారులు తిరస్కరించారు. అన్ని మద్యం దుకాణాలకు ఒకే నిబంధన వర్తింపజేయాలనే ఉద్దేశంతో రెన్యువల్ తోసిపుచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ మార్ట్‌కు ప్రత్యేక లైసెన్స్ విధానంపై సమీక్ష చేస్తామన్నారు.

ఆదివారం టానిక్ మార్ట్ మూసివేసే సమయానికి అందులో దాదాపు 1.7 కోట్ల విలువ చేసే మద్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ సరుకును మద్యం డిపోకు తరలించారు. అయితే మార్చిలో ఎక్సైజ్ అధికారులు దీంతోపాటు క్యూ పేరిట ఏర్పాటైన ఎనిమిది షాపులపై తనిఖీలు నిర్వహించారు. వీటికి లైసెన్స్ ప్రత్యేంగా ఇచ్చారా? లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సివుంది. లిక్కర్ మార్ట్ వ్యవహారంలో తీగలాగితే డొంక కదిలినట్టు తెలుస్తోంది.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×