MP Asaduddin Owaisi: కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై 140 కోట్ల భారతీయ ప్రజలు రగలిపోతున్నారు. పలువురు రాజకీయ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు.
పాక్ తీరుపై ఓవైసీ ఫైర్
పాకిస్థాన్ సర్కార్, దాని నిఘా సంస్థ అయిన ఐఎస్ఐ (ISI) అక్రమ సంతానమే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అని సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ను తక్షణమే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్ ఉంచాలని.. దీనికి సంబంధించి వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పాకిస్థాన్ ఆర్మీ ప్రవర్తిస్తున్న వ్యవహరిశైలిపై కూడా ఆయన మండిపడ్డారు.
హిందూ- ముస్లింల మధ్య ఘర్షణలకు ప్రయత్నం..
భారత్ పై అణుబాంబులు వేస్తామని హెచ్చరించిన పాక్ మినిస్టర్ పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా వ్యాఖ్యనించిన మినిస్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు ఒక్కటి గుర్తించుకోవాలి.. మీరు మాతో పోలిస్తే ఒక అరగంట వెనుకబడి లేరు.. భారతదేశం కంటే అర్ధ శతాబ్ధం వెనుకబడి ఉన్నారు’ అని చెప్పారు. పాకిస్థాన్ దేశ బడ్జెట్ భారత సైనిక బడ్జెట్ కు కూడా సమానం కాదని చెప్పారు. హిందూ – ముస్లింల మధ్య ఘర్షణలు లేవనత్తడానికే పాకిస్థాన్, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
అలాగే, భారత్ లో ‘రక్తం ప్రవహిస్తుంది’ అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ముందు మీ తల్లిని ఉగ్రవాదులు చంపారని.. ఆ విషయం తెలుసుకుని మాట్లాడాలని.. చిన్న పిల్లల మాదిరగా మాట్లాడకూడదని హెచ్చరించారు.
పాకిస్థాన్ పై తాము ఎలాంటి కుట్రలు చేయడం చేయడం లేదని.. కానీ వారు ఏదైనా చేస్తే ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని.. సూచించారు. ఒకవేళ భారత్ లో రక్తం ప్రవహిస్తే.. అది ఇటు వైపు కంటే.. పాక్ వైపే ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉందని అసదుద్దీన్ ఓవైసీ ఫైరయ్యారు.