Big Stories

KCR on MLC Kavitha’s Arrest: కూతురు కవిత అరెస్ట్‌పై తొలిసారి నోరువిప్పిన కేసీఆర్.. ‘అది అంతా ఉత్తిదే’!

Ex CM KCR Reaction on MLC Kavitha’s Arrest in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. తన కూతురు, ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత.. కేసీఆర్ మొదటిసారిగా మీడియా ముందు కవిత అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఓ నాటమేనని కేసీఆర్ ఆరోపించారు. తన కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమేనని అన్నారు. కవితను కుట్రపూరితంగానే బీజేపీ ఈ కేసులో ఇరికించిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటమని విమర్శించారు.

- Advertisement -

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయడానికి బీఆర్ఎస్ పోలీసులను పంపిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ ఘటన జరిగిన నుంచి బీఆర్ఎస్ పై ప్రధాని మోదీ కక్ష కట్టారని కేసీఆర్ అన్నారు.

Also Read: CM Revanth counter to KCR: కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్, దమ్ముంటే టచ్ చేసి చూడు..

kcr latest news today

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవితను బీజేపీ అక్రమంగా ఈ లిక్కర్ కేసులో ఇరికించి జైలుకు పంపిందని అన్నారు. అరెస్ట్ చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా సరే ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందన్నారు. అయితే తన సొంత కూతురు అరెస్ట్ అయిన దాదాపు నెల తర్వాత కేసీఆర్ మొదటి సారిగా నోరు విప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడుతుందని కేసీఆర్ జోష్యం చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 104 మంది ఎమ్మేల్యేలు ఉన్న తమనే బీజేపీ కూల్చేందుకు చాలా ప్రయత్నాలే చేసిందని.. అలాంటిది 64 మంది ఉన్న కాంగ్రెస్ ను వదులుతుందా అని అన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు ముఖ్య నేతలు తనలో టచ్ లో ఉన్నారని కేసీఆర్ తెలిపారు.

Also Read: బీఆర్ఎస్‌కు షాక్.. సార్ వెళ్లొస్తా, బేతి గుడ్ బై

ప్రస్తుతం కాంగ్రెస్ లో బీజేపీ పెత్తనం నడుస్తుందని.. దీని కారణంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు అంతా ఎంతగానే బాధపడుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరిగినా దాని ద్వారా.. బీఆర్ఎస్ పార్టీకి మంచే జరుగుతుందన్నారు. తెలంగాణభవన్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News