Big Stories

Sekhar Kammula on Leader 2: ఇప్పటి రాజకీయాలు మరింత దిగజారిపోయాయి.. లీడర్ 2 చేయాలంటే..?

Sekhar Kammula Comments on Leader 2 Movie: టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన కథలు మిగతావారికంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. 2000లో డాలర్ డ్రీమ్స్ చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల ఆ తరవాత హ్యాపీ డేస్ నుంచి లవ్ స్టోరీ వరకు మంచి మంచి సినిమాలు చేశాడు. మంచి విలువలతో సినిమాలు చేస్తున్న ఆయన దర్శకుడిగా 24 ఏళ్ళు పూర్తి చేసుకుని 25 ఏట ప్రవేశించిన సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

- Advertisement -

ఇక ఈ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల లీడర్ సినిమా గురించి మాట్లాడాడు. రానా మొదటి చిత్రం లీడర్ కు దర్శకత్వం వహించింది ఆయనే. లక్ష కోట్ల అవినీతి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఒక ముఖ్యమంత్రి చనిపోతే.. అతడి కొడుకు చదువును ఆపేసి తండ్రి లక్ష్యాన్ని, రాజకీయ మార్పును తీసుకురావటానికి ఏం చేశాడు అనేది లీడర్ లో చూపించాడు. ఈ సినిమా అప్పట్లో ప్రజలకు ఎక్కలేదు. ఇక గత కొన్నిరోజులుగా లీడర్ 2 వస్తుంది అని ప్రచారం సాగుతుంది. దాని గురించి ఆయన మాట్లాడాడు.. “లీడర్ 2 నాకు తీయాలని మైండ్ లో వుంది. కానీ సమయం కుదరడంలేదు. చేస్తే తప్పకుండా మరలా రానా తోనే చేస్తా. అప్పట్లో లీడర్ తీసేటప్పుడు లక్ష కోట్ల అవినీతి అంటే నమ్మేలా లేదేమో అన్నారు అంతా. కానీ ఇప్పుడు లక్ష కోట్లు ఆఫ్ట్రాల్ అయిపోయాయి. ప్రజలు కూడా చాలా ఈజీగా తీసేసుకుంటున్నారు. అప్పుడు రాజకీయాలు వేరు.. ఇప్పుడు మరింత దిగజారిపోయాయి.

- Advertisement -

Also Read: MAD Square: మొన్న మ్యాడ్ మ్యాక్స్ అన్నారు.. ఇప్పుడేమో మ్యాడ్ స్క్వేర్ అంటున్నారేంటి.. ?

ఒక పర్సన్ గురించి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా చెప్పాలి. ఇవన్నీ కుదరాలంటే కాస్త సమయం పడుతుంది. లీడర్ లో ఏమి చేసినా చివరికి హీరో రియలైజ్ అవుతాడు. కానీ ఇప్పుడు ఏది చెప్పాలన్నా దానికి సొల్యూషన్ లాజిక్ గా చెప్పాలి. అందుకు చాలా టైం పడుతుంది. ఏదైనా సమస్య చెబితే దాని పరిష్కారం కూడా చెప్పగలగాలి. కథలు రాయవచ్చు. కానీ, మంచితనం సొల్యూషన్ అనేది చాలా కష్టంగా మారింది. మంచే గెలుస్తుంది. చెడు ఓడిపోతుంది.. అనేది ప్రాక్టికల్ గా చెప్పాలి. ఏదైనా కొత్తవారితో చేయడం అనేది కూడా కథ ప్రకారమే.. ఇప్పుడు చేయబోయే కుబేర సినిమా కూడా ఈ పాత్రకు ఇతనే వుండాలి అని రాసుకున్నదే. లీడర్ సినిమా రానాతోనే చేయాలి. కొత్తవారితో చేయాలని ట్రై చేస్తే దెబ్బతింటాం” అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News