E-Paper
Advertisement

హైటెక్ అవతారంలో మలక్‌పేట్ టీవీ టవర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫ్రీగా టీవీ చూడొచ్చు, అదెలా సాధ్యం?

హైటెక్ అవతారంలో మలక్‌పేట్ టీవీ టవర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫ్రీగా టీవీ చూడొచ్చు, అదెలా సాధ్యం?
Advertisement

Hyderabad City:  దూరదర్శన్ ప్రసారాలకు కేంద్రంగా నిలిచింది హైదరాబాద్ మలక్‌పేట్ టీవీ టవర్. ఈ టవర్ ఏర్పాటు చేసి దాదాపు 50 ఏళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ టవర్ నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా టీవీ ఛానళ్లు చూడొచ్చు. దీనికోసం ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

 

హైటెక్ అవతారంలో మలక్‌పేట్ టీవీ టవర్

Advertisement

హైదరాబాద్‌ పేరు చెప్పగానే ముందుగా మలక్‌పేట్ టీవీ టవర్ గుర్తుకు వస్తుంది. ఈ టవర్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. దూరదర్శన్ ప్రసారాల యుగంలో లక్షలాది ఇళ్లకు టీవీ సిగ్నల్స్‌ను అందించింది ఈ టవర్. తాజాగా సరికొత్త టెక్నాలజీతో ప్రజల ముందుకు రాబోతోంది. ఇంటర్నెట్ లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే నేరుగా స్మార్ట్‌ఫోన్‌లో టీవీ ఛానళ్లను చూడొచ్చు.

మలక్‌పేట్ టీవీ టవర్‌ త్వరలో 50 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీని అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తాజాగా డిజిటల్ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రంగా మారనుంది. ప్రస్తుతం ఆ విధంగా పరీక్షలు జరుగుతున్నాయి.  అవి సక్సెస్ అయితే వచ్చే ఏడాది హైదరాబాద్ సిటీవాసులకు ఈ తరహా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

 

ఇంటర్నెట్ లేకున్నా ఫ్రీగా టీవీ చూడొచ్చు

ఈ విషయాన్ని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. మొబైల్‌లో వచ్చే ఛానళ్లు పూర్తిగా ఉచితం. కొత్త విధానం టీవీ ఛానళ్లు ఇంటర్నెట్ ఆధారంగా కాకుండా నేరుగా ప్రసార సంకేతాల రూపంలో మొబైల్ ఫోన్లకు రానున్నాయని సమాచారం. స్టూడియో నుంచి శాటిలైట్‌కు పంపించిన సిగ్నల్‌ను మలక్‌పేట్ టీవీ టవర్ తీసుకుంటుంది.

అక్కడి నుంచి ట్రాన్స్‌మిటర్ల ద్వారా సుమారు 60 కిలోమీటర్ల పరిధిలోని మొబైల్ ఫోన్లకు ప్రసారాలు చేరనున్నాయి. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ఛానళ్లను వినియోగదారులు వీక్షించవచ్చు. తొలిదశలో దూరదర్శన్‌కు చెందిన డీడీ యాదగిరి, డీడీ సప్తగిరి, డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ స్పోర్ట్స్‌తోపాటు ఇతర ప్రాంతీయ ఛానళ్లను అందుబాటులోకి రానున్నాయి.

 

డిజిటల్ మొబైల్ బ్రాడ్‌కాస్టింగ్ కేంద్రంగా మార్పు

క్రీడల ప్రసారాలు మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రధాన ఆకర్షణగా మారే ఛాన్స్ ఉంది. చాలా స్పోర్ట్స్ ఈవెంట్లకు సంబంధించిన ప్రసార హక్కులు దూరదర్శన్ వద్ద ఉన్నాయి. క్రీడాభిమానులు ఇంటర్నెట్ లేకుండానే వివిధ గేమ్స్ ఉచితంగా చూడవచ్చు. కేవలం ఇవేకాకుండా భవిష్యత్తులో ప్రైవేట్ టీవీ ఛానళ్లను ఈ తరహా ప్లాట్‌ఫారమ్‌లో అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోందట ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే టీవీ ప్రసార రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్టే.

ALSO READ: వరదలో చిక్కుకున్న కారు.. ప్రాణాలకు తెగించి కుటుంబాన్ని రక్షించిన స్థానికులు

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×