E-Paper
Advertisement

హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్‌లోకి అడుగు పెట్టేదెప్పుడంటే?

హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్‌లోకి అడుగు పెట్టేదెప్పుడంటే?
Advertisement

Hero Electric Bike 2027: భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటో కార్ప్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు విడా బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రధానంగా దృష్టి పెట్టిన కంపెనీ.. ఇక ఎలక్ట్రిక్ బైక్స్ విభాగంలోకి కూడా అడుగుపెట్టనుంది. తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను 2027లో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. హీరో మోటోకార్ప్ ప్రస్తుతం రెండు ప్రత్యేక ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ ప్లాట్‌ ఫామ్‌లపై పనిచేస్తోంది. వీటికి UBEX, VXZ అనే కోడ్‌ నేమ్‌లు పెట్టారు. ఈ రెండు ప్లాట్‌ ఫామ్‌లు ప్రస్తుత విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఉపయోగిస్తున్న ఆర్కిటెక్చర్‌పై ఆధారపడకుండా.. ప్రత్యేకంగా మోటార్‌ సైకిళ్ల కోసం రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌లు

హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేస్తున్న UBEX ప్లాట్‌ ఫామ్‌ను స్ట్రీట్ నేకెడ్ తరహా ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ కోసం ఉపయోగించనున్నారు. సిటీలో రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు VXZ ప్లాట్‌ ఫామ్‌ను అమెరికాకు చెందిన జీరో మోటార్ సైకిల్ సాకారంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్‌ ఫామ్‌పై రూపొందే ఎలక్ట్రిక్ బైక్‌కు ఎక్కువ పనితీరు, మంచి రైడింగ్ సామర్థ్యం ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా అడ్వెంచర్, పెర్ఫార్మెన్స్ బైక్‌లను ఇష్టపడే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీనిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్లాట్‌ ఫామ్‌ లకు సంబంధించిన కాన్సెప్ట్‌ లను హీరో మోటో కార్ప్ 2025లో జరిగిన EICMA ఈవెంట్‌ లో తొలిసారి ప్రదర్శించింది. VXZ ప్రాజెక్ట్‌ కు సంబంధించి దేశంలో డిజైన్ పేటెంట్లను కూడా కంపెనీ ఇటీవల దాఖలు చేసింది.

స్కూటర్ ప్లాట్‌ ఫామ్‌కు భిన్నంగా..

Advertisement

కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లకు విడా స్కూటర్ ప్లాట్‌ ఫామ్ నుంచి కొన్ని విషయాలను తీసుకున్నప్పటికీ, రెండు బైక్ ప్లాట్‌ ఫామ్‌లు పూర్తిగా కొత్తవేనని కంపెనీ స్పష్టం చేసింది.  ఈ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్‌ను తీసుకురావడం లేదని, వచ్చే ఏడాది నుంచి కొత్త మోడల్స్ పై కంపెనీ దృష్టి పెట్టనుందని తెలిపారు.

మోటార్‌ సైకిల్ వినియోగదారుల అవసరాలు స్కూటర్ వినియోగదారులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. అందుకే కొత్త ప్లాట్‌ఫామ్‌లను మోటార్‌ సైకిల్‌ కు అవసరమైన పనితీరు, రైడబిలిటీ, గ్రేడబిలిటీ, రేంజ్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది.

EV సెగ్మెంట్ లో హీరో దూకుడు

Advertisement

ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ ప్రాజెక్ట్‌ తో పాటు విడా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారాన్ని కూడా హీరో విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నెలకు సుమారు 15,000 విడా ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యాన్ని FY27లో నెలకు 45,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027లో తొలి ఎలక్ట్రిక్ బైక్ విడుదలైన తర్వాత ఈ విభాగంలో కంపెనీ మరిన్ని మోడళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది.

Read Also: 2 గంటల్లో ఛార్జ్.. 260 కి.మీ రేంజ్.. అదిరిపోయే అవోర్ ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×